June 13, 2013

"కొడుకు" అనే భాగం నుండి 4 పద్యములు.

శ్రీ గుల్లల వీర్రాజు గారి "సూక్తి సుమమాల"
అనే నీతి పద్యములు నుండి
"కొడుకు" అనే భాగం నుండి 4 పద్యములు.


1
కొడుకే పెంచును తుదకని
కడకేమియు మిగులకున్న కలవర పడకన్
కొడుకును కడు గారవమున
విడువక పెంచిన చివరకు వినయము వీడున్ ||



2
కని పెంచిన వారనియున్
కనికరమే యుండదసలు కాంతను గనినన్
కనిపించవేమి కంటికి
వినిపించదు వీనులకును విరివిగ ఏమిన్ ||



3
కొమరులు కలిగిన తనకున్
శ్రమ తప్పునని తలచి కడు శ్రమలకు నోర్చున్
కొమరుడు కోరిన కన్యను
సమకూర్చిన తదుపరి తను సంగతె మరచున్ ||



4
మనమెటు చూడగనుంటిమొ
మన సంతతి కూడ యటులే మనలను జూచున్
యనుమాట మరచి మీరును
మనుటకు యోచించకండి మహిలో నెపుడున్ ||




No comments:

Post a Comment