June 30, 2013

షష్టిపూర్తి మహొత్సవమ్


షష్టిపూర్తి మహొత్సవమ్:--

షష్టిపూర్తి అంటే 60 సంవత్సరాలు నిండిన వ్యక్తి మరల ఆరోగ్యం, ఆనందం, ఆయువు వృద్ధికొరకు చేసే వేడుకైన పండుగ. తమ పిల్లలు, మనుమలు కలసి బంధువులు అంతా ఒక దగ్గరచేరి సంతోషంగా జరుపుకొనే వేడుక.
షష్టిపూర్తి చేయవలసిన విధానము-----
ఆయుషు హోమం
జన్మ నక్షత్ర జపం
శాంతి హొమం
దశదానాలు
మొదలగునవి చేస్తారు.
మాంగళ్యధారణ, తలంబ్రాలు వేడుకగా చేసుకుంటారు. ముఖ్యంగా ముగ్గురు దంపతులకు పాదపూజ చేస్తారు.
షష్టిపూర్తి చేసుకొనేవారి తల్లిదండ్రులు ఉన్నట్లయితే వారికి, లేకుంటే వారి పేరు మీద ఇతరులకు.... వారికంటే పెద్దవారికి..... లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి ఒక జంటకు పాదపూజ చెయ్యాలి.
మంగళాస్నానాలప్పుడు పిల్లలే పెద్దలై.... తలకు చమురు పెట్టి స్నానం చేయిస్తారు.
ఇంత ఆనందంగా జరుపుకొనే షష్టిపూర్తి వేడుకల యొక్క తీపి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఆ దంపతులు తమ మిగిలిన కాలాన్ని ఆనందంగా మరియు ఆరోగ్యంగా గడుపుతారు.
(ఇది నాకు తెలిసినంతవరకు షష్టిపూర్తి యొక్క విశేషాలు..... ఎందుకంటే మా అమ్మానాన్నలకు ఈ విధంగానే 15 సంవత్సరాల క్రితం షష్టిపూర్తి వేడుకలు జరిపాము.)


No comments:

Post a Comment