April 22, 2013

గోమాత దర్శనము చేయునప్పుడు చదివే శ్లోకాలు:--

గోమాత దర్శనము చేయునప్పుడు చదివే శ్లోకాలు:--

నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్య ఏవచ l 
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః ll 

భావం:-
శ్రీమంతంబులై కామధేను సంతతులైన బ్రహ్మాదులచే స్తుతించబడిన పవిత్రములైన గోవులకు నా నమస్కారము....
గావో మమాగ్రతః నను గావో మే సంతు పృష్టతః l
గావో మే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యాహం ll

భావం:--
గోవులు నాముందు-వెనుకలందు యుండుగాక. గోవులే నా హృదయము. గోవుల మధ్యయందు నేను నివసించుచున్నాను.....

సర్వ దేవమయే దేవి సర్వ దేవైరలం కృతే l
మమాభిలషితంకర్మ సఫలం కురు నందిని ll

భావం:--
ఓ గోమాతా ! సర్వదేవతాస్వరూపిణి, సర్వదేవతలచే అలంకరింపబడినదానా ! నా కోర్కెలను సఫలం చేయుము.....







No comments:

Post a Comment