April 22, 2013

పెద్దలు చెప్పిన కొన్ని సుద్దులు

పెద్దలు చెప్పిన కొన్ని సుద్దులు:--

మనం శారీరక సంరక్షణ కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం. ఎండా, వేడిమి, చలి నుండి రక్షణ కోసం ఎన్నోరకాల దుస్తులు, టోపీలు, కళ్ళద్దాలు, పాదరక్షలు మొదలైనవి వాడతాము కదా, మనం భౌతికముగా రక్షించుకోవటానికి ఇన్ని రకాల రక్షణలు అవసరమైనప్పుడు ఎన్నో సమస్యలతో, కోరికలతో, అవమానాలతో, తీరని మొహాలతో, భయాలతో, దుఃఖాలతో, సతమతమయ్యే మనసుకు ఏది సంరక్షణ ? 

కోరిక తీరుతుందన్న ఆశ, జరుగుతున్నదానికి కర్త వేరే ఉన్నాడని జ్ఞానం, మంచి జరుగుతుందనే ధైర్యం ఇవన్నీ ఉంటేనే మనసు రక్షించబడుతుంది. ఇవి లేకపోతె మనసు ఆరోగ్యాన్ని కోల్పోయి, వ్యాధిగ్రస్తమవుతుంది, పతనానికి దారితీస్తుంది. కనుక మన సమస్యలన్నీ చెప్పుకోవటానికి మనకొక ఆధారం కావాలి. ఆ ఆధారం శక్తివంతమై ఉండాలి. మన ఆలోచనలు దానికి చేరుకోవాలి. మన ఆశలు కోరికలు తీర్చగలదన్న విశ్వాసం మనకు ఉండాలి. ఇవన్నీ ఎవరు చేయగలరు ? ఒక్క భగవంతుడు మాత్రమే. కనుక భగవంతుడిని నమ్మిన వారు మానసిక సంరక్షణ ఏర్పాట్లు చేసుకున్నట్లే.

పాపాలకి శిక్షలు పడతాయని నమ్మటం ద్వారా, కొంతైనా పాప భీతి పెరిగి, నేర ప్రవృత్తి తగ్గుతుంది. భగవంతుని ప్రార్ధిస్తే పనులు జరుగుతాయని నమ్మటం ద్వారా జీవితం పట్ల ఆశ చిగురిస్తుంది. ఎవరైనా మనలను మోసం చేస్తే పోనీలే ఏ జన్మలోనో వారికి ఋణపడి ఉన్నాం అనుకోవటంలోనే ఉపశమనం ఉంది. మన ఆత్మీయులు చనిపోతే వారు భగవంతునిలో వేలీనమయ్యారని, మంచివారిని దేవుడు త్వరగా తీసుకెళ్లతాడని మళ్లి వెంటనే జన్మిస్తారని అనుకోవటంలో ఆత్మతృప్తి ఉంది. మనం ఎటువంటి పరిస్తితిలో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలో మన మనస్సును ఎలా సర్ది చెప్పుకోవాలో తెలియచెప్పేందుకే మన పెద్దలు మనకి ఈ భక్తి మార్గాన్ని చూపించారు.








No comments:

Post a Comment