April 22, 2013

మనోవికాసానికి మంచి భక్తి మార్గం

మనోవికాసానికి మంచి భక్తి మార్గం:-- 

భక్తితో మనసు నిండినవారు తమ జీవితాలలో ఎదురైన కష్టాలను అవలీలగా ఎదుర్కొంటారు. వారి వెనుక దైవం ఉంటుందన్న నమ్మకంతోటే, వారు ముందడుగు వేస్తారు. నిత్యం భగవన్నామస్మరణం చేయటం అలవాటు చేసుకోవాలి .మనవల్ల ఏదైనా ఇతరులకి హాని కలిగినట్లైతే, దేముని ఎదుట క్షమించమని వేడుకుని, మంచి పనులు చేస్తామని, ఇంకెప్పుడు ఎవరికీ హాని కలిగించబోమని ప్రమాణం చేయవలెను.ఎటువంటి పరిస్థితిలోనైనా చెక్కుచెదరని మానసిక ధైర్యాన్ని ఇవ్వమని దైవాన్ని కోరుకోవాలి.మనకి ఈ మానవ జన్మ ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి
.
ఐతే విపరీతమైన భక్తి కూడా మానసిక రోగాలకు దారితీసి, మనలో విపరీత భావాలు కలిగిస్తాయి. కనుక వివేకమంతమైన భక్తి కలిగి ఉంటే చాలును. మహర్షులు వందల సంవత్సరాలు జీవించి యున్నారంటే.... వారిలోని వివేకమంతమైన ఆలోచనావిధానం....భక్తితో కూడిన మానసిక ధైర్యమే అందుకు కారణం.....అందువల్ల మానవునికి సత్ప్రవర్త,. భక్తి, ధైర్యం అవసరం..........

దైవం అనేది ఒక సనాతమైన, శక్తివంతమైన వ్యవస్థ. అది మంచివాళ్ళకు తప్పక మంచే చేస్తుంది. దుర్మార్గులలోని దుర్మార్గాన్ని, రూపుమాపటానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే దైవం ఎప్పుడు ధర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది. దుర్మార్గులు తమ తప్పులను తెలుసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి అనేక అవకాశాలు కల్పిస్తుంది. అప్పటికీ వారు మంచివారిని బాధిస్తువుంటే, లోక రక్షణ కోసం.....దైవమే వారిని నిర్మూలిస్తుంది. వివిధ దేవతల సహస్ర నామాలు....కేవలం అవి నామాలు మాత్రమే కావు.....భగవంతుని వాస్తవిక స్వరూప స్వభావాలను వ్యక్తపరచే అక్షర పరంజ్యోతులు......వాటికి మనం శిరస్సు వంచి నమస్కరిద్దాం..........






No comments:

Post a Comment