October 10, 2013

దశరా నవరాత్రులలో నాల్గవరోజు కూష్మాండ అవతారవిశేషములు

దశరా నవరాత్రులలో నాల్గవరోజు  కూష్మాండ అవతారవిశేషములు  



(4) కూష్మాండ:

సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ
దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||   


   
దుర్గామాత నాల్గవ స్వరూపం కూష్మాండాదేవి.  దరహాసం చేస్తూ బ్రహ్మాండాన్ని అవలీలగా సృష్టిస్తుంది. కాబట్టి ఈమెకు ఆ  పేరు వచ్చింది. ఈమె సర్వమండలాంతర్వర్తిని. రవి మండలంలో నివశించే శక్తి సామర్థ్యాలు ఈ తల్లికే ఉన్నాయి. ఈమె ఎనిమిది భుజాలతో ఉంటుంది. తన ఏడు చేతుల్లోనూ కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద ధరిస్తుంది. ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాలను ధరిస్తుంది. ఈమె సింహవాహనం అధిష్టిస్తుంది. సంస్కృతంలో కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఈమెకు గుమ్మడికాయ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈమెకు గుమ్మిడికాయను బలిగా సమర్పిస్తారు. ఈ దేవిని ఉపాసిస్తే సాధకుని మనసు అనాహతచక్రంలో స్థిరంగా ఉంటుంది. ఉపాసకులకు ఆయురారో గ్యాలను ప్రసాదించటమేగాక, వారి కష్టాలను కూడా పోగొడుతుంది. మనపురాణాలలో తెలిపిన విధంగా దుర్గామాతను మనం భక్తితో పూజించి ఒక అడుగు ముందుకు వేసినచో.... మనలను రక్షించుటకు ఆమె ముందుకు వచ్చును.సహృదయముతో ఈమెను శరణు వేడిన పరమపదము అతి సులభముగా లభించును.


నాలుగవరోజు నైవేద్యం ----- చిల్లులేని అల్లం గారెలు....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)   


2 comments:

  1. చాల మంచి విషయాలు తెలియజేసారు శ్వేతా గారు

    ReplyDelete