సీతారాముల దాంపత్యం.....మనకు కావాలి ఆదర్శం
పతిసేవలోనే సతికి మోక్షమని తెలియచేసే రమణీయమైన కథ రామాయణ గాథ. అన్నమాట జవదాటని తమ్మునిగా లక్ష్మణుడు పాటించిన నియమాలు, మానవులమైన మనలో ఎంతమంది తమ్ముళ్ళు ---- అన్నమాటని పాటిస్తున్నారు.
తండ్రిమాట జవదాటని తనయునిగా శ్రీరామచంద్రుడు.... మానవజన్మనెత్తి, కష్టాలకోర్చి, సమస్యలను ఎలా అధిగమించాలో.... తాను కష్టాలను అనుభవిస్తూ.... మనలను కూడా కష్టాలువస్తే భయపడకుండా ధైర్యం వహించి, ఎలా నిలబడాలో తెలుపుతూ, అతనికి దైవశక్తి ఉన్నప్పటికీ ఉపయోగించుకోకుండా కేవలం మానవ మాత్రునివలె నడుచుకుంటూ, అతని మార్గంలో మనలని కూడా నడవమన్న ఆదర్శపురుషుడు.....మన శ్రీరామచంద్రమూర్తి.
అయోనిజగా అవనిపైకి వచ్చి, ఎన్ని కష్టాలువచ్చిన, పతినొదిలిపెట్టి, సతి ఉండకూడదనే నగ్నసత్యాన్ని స్త్రీలకు చాటిచెప్పిన పతివ్రతాశిరోమణి మన సీతమ్మ.
అన్నను వదిలిపెట్టి ఉండలేక---అన్న కోసం, కన్న తల్లిదండ్రులనీ, భార్యనీ కూడా వదిలి, అడవులకేగిన లక్ష్మణుడు మనకందరకు ఆదర్శ పురుషుడు.
శ్రీరాముడు తాను పరమాత్మ ఐనప్పటికీ, మహిమలున్నప్పటికి, ఏనాడూ, ఎవ్వరికి ఆ విషయం ఎవ్వరికి తెలియచేయలేదు.
అటువంటి ఆదర్శవ్యక్తుల యొక్క జీవితచరిత్రలను ఎంతచెప్పుకున్నా తనివితీరదు. అటువంటివారి గురించి విన్నా, తలచినా ఎంతో పుణ్యము, ధన్యులము.
No comments:
Post a Comment