March 28, 2014

కొన్ని యక్ష ప్రశ్నలు

కొన్ని యక్ష ప్రశ్నలు (1భాగం)

మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు  ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు అడుగుతాడు. వాటిలో కొన్నిటిని తెలియచేస్తున్నాను..

1) ఎవడు సంతోషంగా ఉంటాడు?
అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు

2) ఏది ఆశ్చర్యం?
ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం.

3) లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు

4) ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
సుఖపడతాడు..

5) నరకం అనుభవించే వారెవరు?
ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు..

6) మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది?
మైత్రి..

7) ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు?
అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు..

8) అహంకారం అంటే ఏమిటి?
అజ్ణ్జానం..

9) మూర్ఖుడెవడు?
ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు..

10) దానం అంటే ఏమిటి?
సమస్తప్రాణుల్ని రక్షించడం..

11) స్నానం అంటే ఏమిటి?
మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం..

12) ధైర్యం అంటే ఏమిటి?
ఇంద్రియ నిగ్రహం...

13) దు:ఖం అంటే ఏమిటి?
అజ్ణ్జానం కలిగి ఉండటం...

14) సోమరితనం అంటే ఏమిటి?
ధర్మకార్యములు చేయకుండుట...

15) దయ అంటే ఏమిటి?
ప్రాణులన్నింటి సుఖము కోరడం..

16) జ్ణ్జానం అంటే ఏమిటి?
మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం...

17) సర్వధనియనదగు వాడెవడౌ?
ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు...

18) క్షమ అంటే ఏమిటి?
ద్వంద్వాలు సహించడం...

19) మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును?
వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో...

20) లోకాన్ని కప్పివున్నది ఏది?
అజ్ణ్జానం....

21) ఎవరితో సంధి శిధిలమవదు?
సజ్జనులతో.....

22) దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?
మనస్సు......

23) సుఖాల్లో గొప్పది ఏది?
సంతోషం.......

24) ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?
అహింస........

25) లోకానికి దిక్కు ఎవరు?
సత్పురుషులు........


No comments:

Post a Comment