July 4, 2020

శ్రీమద్భగవద్గీత - రాఘవ మాస్టారు గారు

శ్రీమద్భగవద్గీత వ్యాఖ్యానాన్ని రోజుకొక శ్లోకానికి తెలుసుకుందామా?

ఈ వ్యాఖ్యానాన్ని శ్రీ టి.పి.రాఘవాచార్యులు గారు (రాఘవ మాస్టారు గారు) మనకి అందిస్తున్నారు. అతని గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం. 
   
భక్తిసార విజయం తిరుమర్షి ఆళ్వార్ చరిత్రని 5 అంకాలు నాటకంగా రాశారు. దానిని రంగరామానుజ జీయరు స్వామివారు పరిశీలించి మంగళాశాసనం చేసారు. 

ఎమ్బెరుమాన్నార్ల సమగ్ర జీవిత చరిత్రని ఒక సుదీర్ఘ నాటకంగా 8 గంటలు ఉండేట్లుగా 4 భాగాలుగా రాశారు. దాన్ని రంగరామానుజ జీయర్ స్వామివారు ప్రదర్శించారు. ఇది ఒక పుస్తక రూపంలో కూడా ప్రచురణ జరిగింది. 

భారత హరివంశాన్ని తెలుగులో వ్యావహారిక భాషలోకి 2012 మొదలుకొని 2017 వరకు 6 సంవత్సరాల పాటు దానిని ధారావాహికగా ప్రకటించారు.  సుమారుగా 1150 పేజీలు గ్రంధంగా రూపుదిద్దుకుంది. దానిని ప్రతినెలా శరణ్య మాసపత్రికలో ప్రచురించారు. 

శంషాబాద్ శ్రీశ్రీశ్రీ త్రిడింది రామానుజ చినజీయర్ స్వామివారి ఆశ్రమంలో ఉండి ,ఎంబరుమన్నార్లు మీద భజనలు పాడుకోవటానికి వీలుగా సామాన్యులకి అర్ధమయ్యే భాషలో స్వామివారి కోరికమీదట "ఆచార్య కీర్తికౌముది" అనే పేరుమీద 108 పాటలని రాసి స్వామివారికి సమర్పించారు. దీనిని స్వామివారు పుస్తక రూపంలో కూడా విడుదల చేసారు. ఈ గీతాలన్నిటిని పడాల.రామారావుగారు స్వరపరచి  గాయకులతో పాడించి యూట్యూబ్ లో ఉంచారు. 
రామానుజులవారి జీవిత ఘట్టాలనన్నిటిని ఒక సుదీర్ఘమైనటువంటి గీతామాలికగా ఒకటే పల్లవితో చరణాలు సాగుతాయి. ఒక 25 ఘట్టాలని తీసుకొని 265 చరణాలతోటి రామానుజులవారి చరిత్రని "రామానుజచరితం" అనే ఒక గీతంగా రచించారు. ఇది కూడా ఒక పుస్తకంగా వెలువడింది. 
రామానుజులవారి గురించి తమిళంలో "ప్రపన్న గాయత్రీ" అంటారు 108 పాశురాలలోను తెలుగులో గీతాలుగా రచించారు. వాటిని కూడా స్వామివారు పుస్తక రూపంలో ముద్రించారు. 
రామానుజులవారి చరిత్ర ఆధారంగా "రామానుజ ప్రస్నోత్తర కరదీపిక అనే పేరుతో సుమారుగా 700 ప్రశ్నలు - సమాధానములు రామానుజులవారి జీవిత ఘట్టాలకు సంబంధించి భగవద్రామానుజుల సంఘం వారు వీటిని పుస్తకం రూపంలో సుమారుగా 5 సార్లు ముద్రించారు. 
యతిరాజ సప్తతి అనే స్తోత్రం భక్తినివేదన పత్రికలో 2015 నుండి 2019 వరకు ప్రతినెలలోనూ 2 శ్లోకాలకి  వ్యావహారిక భాషలో వ్యాఖ్యానం ఇవ్వటం జరిగింది.   
విజయనగరం వారికి అతిమానుషస్తవం అని కూరేశులవారి స్తోత్రం ధనుర్మాసం సందర్భంగా వివరణ ఇవ్వటం జరిగింది. ఈ అతిమానుషస్తవం అర్థ తాత్పర్యాలతో పుస్తకం రూపంలో ముద్రణా కార్యక్రమంలో ఉంది. 
భక్తినివేదనలో కొన్ని వ్యాసాలు వచ్చాయి 
క్రిందటి నెల నుండి ఉత్తర రామాయణ కథలు, గాధలు అనే పేరుతోటి ఉత్తర రామాయణంలోని విశేషాలన్నిటిని ఒక ధారావాహికగా వెలువరించటం జరుగుతోంది 
ఇది రాఘవ మాస్టారుగారి ఆధ్యాత్మిక వ్యాసంగం. 
శ్రీభాష్యం అప్పలాచారి స్వామివారి దగ్గర, వరంగల్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామివారి దగ్గర, కరి రామానుజ స్వామివారి దగ్గర, కందాళ వెంకటాచార్య స్వామివారి దగ్గర, వారి అన్నగారైన టి.పి.శ్రీరామచంద్రాచార్య వద్ద వీరందరి వద్ద సాంప్రదాయ గ్రంధాలూ, భగవద్ విషయాలు మొదలైనవి వీరందివద్ద సేవించారు. సాతులూరి.గోపాలకృష్ణమాచార్యుల వద్ద భగవద్ విషయాలు సేవించటం జరిగింది.                                   

No comments:

Post a Comment