సుమతీ శతకం 41 to 50 poems
41
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరువైన యట్లు పామరుcడుదగన్
హేమంబుcగూడcబెట్టిన
భూమీశుల పాలcజేరు భువిలో సుమతీ !
42
చేతులకు తొడవు దానము,
భూతలనాథులకు దొడవు బొంకమి ధరలో
నీతియె తోడవెవ్వారికి
నాతికి మాలంబు తొడవు నయముగ సుమతీ !
43
తడవోర్వక యొడలోర్వక
కడువేగం బడిచిపడిన గార్యంబగునే
తడవోర్చిన నొడ లోర్చిన
జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ !
44
తన కోపము తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!
45
తన యూరి తపసి తపమును,
తన పుత్రుని విద్య పెంపు, దన సతి రూపున్,
దన పెరటి చెట్టు మందును,
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ !
46
తన కలిమి యింద్ర భోగము
తన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్
దన చావు జగత్ ప్రళయము
తను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ !
47
తనవారు లేని చోటను
జన వించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజున కట నిలువదగదు మహిలో సుమతీ !
48
తమలము వేయని నోరును
వినుతులతో జెలిమి సేసి వెతబడు తెలివిన్
గమలములు లేని కొలకును
హిమధాముడు లేని రాత్రి హీనము సుమతీ !
49
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !
50
తలమాసిన వొలుమాసిన
వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్
కులకాంతలైన రోతురు
తిలకింపగ భూమిలోన దిరముగ సుమతీ!
No comments:
Post a Comment