July 31, 2014
July 29, 2014
భారతీయ ఔన్నత్యం ........ విద్యాధర్ ఎస్ నైపాల్
భారతీయ ఔన్నత్యం ....... హీన్రిచ్ జిమ్మర్
July 27, 2014
"సజ్జన ధార్మిక వేదిక" నిర్వహించిన 31వ శ్రీ వ్యాస జయంతి కార్యక్రమ విశేషాలు
"సజ్జన ధార్మిక వేదిక" నిర్వహించిన 31వ శ్రీ వ్యాస జయంతి కార్యక్రమ విశేషాలు 12-7-2014
"సజ్జన ధార్మిక వేదిక" ...... నాన్నగారు (ఐ.వి. గోపాలాచార్యులు) ఈ సంస్థను స్థాపించి 30 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ప్రతీ సంవత్సరం ఆషాడమాసంలో వచ్చే గురుపౌర్ణమికి ఎవరో ఒకరిని.... పెద్దలని ఆహ్వానించి, వారికి పాదపూజ చేసి, సన్మానించటం ఇన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతున్నది. ఈ సంవత్సరం.... జూలై 12 శనివారంనాడు ..... విశాఖపట్నంలో, శ్రీహరిపురంలో, జవహర్ నగర్ లో వేంచేసియున్న "శ్రీరాధావేణుగోపాలస్వామి" ఆలయంలో మూడు రోజులు పలు ఆధ్యాత్మిక జరిగిన 31వ గురు పౌర్ణమికి డాll బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రిగారికి పాదపూజ చేసి, సన్మానించటం జరిగింది.
ఈ 31 సంవత్సరాలుగా సజ్జన ధార్మిక వేదిక సంస్థని స్థాపించి, కొంతమందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించినందుకుగాను వారు నాన్నగారికి కూడా ఈ సంవత్సరం సన్మానం చేసారు.
మాతృమండలి సభ్యులు, మిగిలిన శిష్యబృందంతో అమ్మ - నాన్నలు
కార్యక్రమాలకి విచ్చేసిన భక్తజనం
స్వామీ వివేకానంద సందేశాలు
స్వామీ వివేకానంద సందేశాలు....... (కర్మ రహస్యం)
1. ప్రాణమున్నంతవరకు పని చెయ్యండి. నేను మీకు అండగా ఉన్నాను. నేను పోయిన తరవాత కూడా నా అంతరాత్మ మీ వెంటే ఉండి పని చేస్తుంది. ఈ జీవితం వస్తుంది. పోతుంది. సంపద, కీర్తి, భోగాలు మూడునాళ్ళ ముచ్చటే. ఒక ప్రాపంచిక క్షుద్రకీటకంవలె చనిపోవటంకన్నా సత్యాన్ని బోధిస్తూ కార్యరంలో మరణించటం ఉత్తమం. ముందంజ వెయ్యండి.
2. మీలో ప్రతీ ఒక్కరూ, కార్య భారమంతా మీపైనే ఉందన్న భావంతో పని చెయ్యండి.
3. ఏ ఘనకార్యాన్నీ మోసంతో సాధించలేం. అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి.
4. జనసమూహం కాదు కావలసింది. పామరుల గుంపు ఒక శతాబ్దంలో చేసిన పనికంటే, నిష్కపటమైన హృదయపూర్వకంగా పనిచేసే కొద్దిమంది ఒక్క సంవత్సరంలోనే ఎక్కువగా సాధించగలరు.
5. నా ఆశ, విశ్వాసం మీ వంటివారి మీదనే ఉన్నాయి. యదార్థదృష్టితో నా మాటలను సరిగా అర్థం చేసుకొని, ఆ ప్రకారంగా మీరు కార్యోన్ముఖులవ్వండి. మీకు కావలసినంత సలహా ఇచ్చాను. కొంచమైన ఇప్పుడు ఆచరణలో పెట్టండి. నా మాటలు వినటం ఉపయొగకరమైనదని లోకానికి తెలియనీయండి.
6. ధైర్యంతో కర్తవ్యాన్ని నిర్వహించు. ఓర్పు స్థిరత్వాలతో పనిచేయి.....ఇదే ఏకైక మార్గము ఓర్మి, పవిత్రత, ధైర్యం, స్థిరత్వంతో పనిచేయాలని గుర్తుంచుకొని ముందుకు నడువు. పవిత్రంగా ఉండి నీ ఆదర్శాలకు కట్టుబడి ఉన్నంత కాలం నీకు అపజయం కలుగదు.
7. నీ ప్రతి పనిలోనూ ఆచరణాత్మకతను కనబరచు. ఆచరణ కొరవడిన అనేక సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా నాసనమైంది.

స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశాలు
స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశాలు :--
1. ఇప్పటి తరం వారిపై ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం. వారి నుండే నా కార్యనిర్వాహకులు రాగలరు. సింహాలవలె వారు సమస్యనంతటిని పరిష్కరిస్తారు. నేను ఒక ఆదర్శన్ని నిర్మించుకొని దానికై నా జీవితాన్ని అంకితం చేశాను. యువకులంతా ఆ ఆదర్శాన్ని ప్రతీ కేంద్రానికి, చివరకు భారతదేశమంతా వ్యాప్తి చేస్తారు.
2. నేను ఈ యువకులను సంఘటిత పరచటానికే జన్మించాను. అంతేకాదు, ప్రతి నగరం నుండి వందలమంది నాతో చేరటానికి సంసిద్ధంగా ఉన్నారు. అప్రతిహతమైన తరంగాలవలె వారిని భారతదేశం పైకి పంపదలచాను. వారు అధమాధుల, పతితుల ఇంటికే వెళ్ళి, వారికి ఓర్పును, నీతిని, మతాన్ని,విద్యను బోధిస్తారు. నేను ఈ పనిని చేసి తీరుతాను లేక మరనించనైనా మరణిస్తాను.

1. సహనశీలురై ఒకరినొకరు విశ్వాసపాత్రులై ఉండండి. మీలో మీరు తగవులాడుకోవద్దు. ఆర్ధికలావాదేవీలలో పరిపూర్ణమైన పారదర్శకతను (స్వచ్ఛతను) కలిగి ఉండండి. మీకు విశ్వాసం, నిజాయితీ, శ్రద్ధాభక్తులు ఉన్నంత వరకు సర్వం వికాసాన్ని పొందుతుంది.
2. మీరందరూ స్వలాభాన్ని, వర్గకీచులాటలను, అసూయను విడిచిపెట్టండి. భూమాతవలె ఓర్మి కలిగి ఉండండి. దీనిని మీరు సాధించగలిగితే లోకమే మీకు పాదాక్రాంతమవుతుంది.
3. విమర్శించటం విడిచిపెట్టండి. ఎదుటివారు చేసే పని మంచిదైతే మీకు చేతనైన సహాయం చేయండి. వారు తప్పుద్రోవ పడుతున్నారనిపిస్తే వారి తప్పులను సున్నితంగా తెలియచేయండి. ఒకరినొకరు తప్పుపట్టుకోవటమే అన్ని అనర్థాలకు మూలం. సంస్థల వినాశనానికి ముఖ్యకారణం కూడా ఇదే.
4. సంఘటితంగా పనిచెయ్యటం కావాలి. నీవు నన్ను అర్థంచేసుకుంటావా? మీకెవరికైనా బుర్రలో ఈ పాటి మేథాశక్తి ఉందా ? ఉంటే మీ మనస్సును పనిచేయనివ్వండి.
5. నిస్స్వార్థంగా పని చెయ్యండి. మరొకరిని చాటుగా దూషిస్తున్న మిత్రుని మాటలను ఎన్నడూ వినవద్దు.
6. కపటం, దుర్మార్గం ఎంత మాత్రం ఉండకూడదు. అల్పశ్వాస పాటి అనైతికత, నలుసంత చెడు విధానం కూడా తగదు.

1. నైతిక ధైర్యంతో ప్రారంభించిన మంచిపనికి ప్రతికూలత ఉంటే, అది ప్రారంభించిన వాళ్ళ నైతిక బలాన్ని మరింత ఉత్తేజ పరుస్తుంది. ప్రతిఘటన, ఆటకం దేనికి ఉండదో అది మానవులను మృత్యుసదృశ నైతిక పతన మార్గానికి కొనిపోతుంది.
2. మనకు కావలసింది స్పందించే హృదయం. ఆలోచించే మెదడు, పనిచేసే బలిష్టమైన హస్తం. కర్మ చేసే యోగ్యతను సంపాదించు. హృదయానికి --మనసుకి సంఘర్షణ జరిగినపుడు హృదయాన్ని అనుసరించు.
3. మీకు కొద్దిపాటి కల్పనాశక్తి లేకపోతె, మార్గదర్శకమైన ఆదర్శం లేకపోతె, మీరు కేవలం పసుతుల్యులే. కాబట్టి మీ ఆదర్శాన్ని తగ్గించుకోకూడదు. అలా అని అసాధ్యమైన దాన్ని ప్రయత్నించరాదు. ఈ రెండూ విసర్జనీయాలే ! ఉన్నత ఆదర్శంతో ఉత్తమ ఆచరణాన్ని మీ జీవితంలో సమన్వయపరచటానికి ప్రయత్నించండి.
4. మనదేశపు ఆసలన్నీ మీపైనే ఉన్నవి. సోమరులుగా మీరు కాలం గడపటం నాకు బాధను కలిగిస్తోంది. కార్యదీక్షాపరులు కండి. ఆలస్యం చేయవద్దు. అంతా సరియైన సమయంలో జరుగుతుందని సోమరులుగా కూర్చోవద్దు. ఆ విధంగా ఏ పనీ నేరవేరదని గుర్తుంచుకోండి.
5. వ్యర్థకాలయాపన పనికి రాదు. అసూయ, అహంకారం అనే భావాలను పూర్తిగా విడిచిపెట్టండి. అప్రతిహతమైన శక్తితో కార్యరంగంలోకి దూకి సాహసవంతులుగా పని చెయ్యండి.
6. నా ఉద్వేగం మీకింకా ఒంటబట్టలేదు. నన్ను మీరు అర్థం చేసుకోలేదు. సోమరితనం, సుఖనుభవం అనే పాతపంథాలలోనే మీరింకా పరుగెత్తుతున్నారు. ఈ అలసత్వం ఇక చాలు. ఇహపర ఫలభోగాసక్తి ఇక చాలు.
7. మీరు నా ఉద్వేగాని అందుకోవాలని, అత్యంత నిష్కపటవర్తనులవ్వాలని నా నిరంతర ప్రార్థన.

July 26, 2014
శ్రావణమాసం------శ్రావణమాస విశిష్టత
శ్రావణమాసం------శ్రావణమాస విశిష్టత
మహాలక్ష్మి యెక్కడ కొలువుంటుంది? గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పూలు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇండ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలకి నివసిస్తుంది.
మహిళలు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఈ మాసంలో నెలంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు మహాలక్ష్మిలా వెలుగొందుతూ తమ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయాలు శ్రావణమాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడనున్నాయి.
పురాణ కధనం:
పురాణాల కథనం ప్రకారం పరమ శివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడు ఐనాడు. లోకాన్ని ఉద్ధరించాడు. శ్రావణమాసం రాగానే గుర్తుకు వచ్చేవి నోములు, పేరంటాలు,శనగల వాయనం. పెళ్ళైన కొత్తలో నోముకున్న మంగళగౌరీ వ్రతం, శ్రావణ శుక్రవార వ్రతం, అమ్మవారి నైవేద్యాలు ... ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు
సోమవారాల్లో శివుడికి అభిషేకాలు,
మంగళవారం గౌరీ వ్రతం
బుధవారం విఠలుడికి పూజలు,
గురువారాల్లో గురుదేవుని ఆరాధన,
శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు
శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి ,భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు.
ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవున్ని పూజించడం తర తరాల నుండి సాంప్రదాయంగా వస్తుంది. రోజు చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీపౌర్ణమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. ఒకటి తర్వాత ఒకటి పండుగలు రావడంతో కొత్త అళ్ళుల్లు, కోడళ్ళు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు రావడంతో ప్రతి హైందవ గడప సందడిగా మారుతుంది.
పరమశివుడి వారం
సోమవారం భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ కొలువగానే కొలువుదీరే శివునికి శ్రావణమాసం అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ మాసంలో వచ్చే సోమవారాలన్నింటిని శివాభిషేకానికి కేటాయిస్తారు. ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాస దీక్షలు చేపట్టి తాంబూళం, దక్షణ సమర్పించి భక్తులు శివుడికి హారతిస్తారు. బిలువ పత్రాలు, ఉమ్మెత, కలువతుమ్మి వంటి శివుడికి ఇష్టమైన పూలతో పూజలు చేయడం ఈ పండుగ ఆనవాయితీ.శుభాలు కలిగే .. మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. మంచి భర్త రావాలని అవివాహితులు, తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.నాగపంచమి శ్రావణమాసం మొదలైన నాలుగవ రోజునే వచ్చే పండుగ నాగపంచమి, శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిర్యాలు, పూలనుపెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడిగెలను భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే ... పుత్రదైకాదశి సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతానయోగ్యత కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. బ్రాహ్మణులు ఈ మాసంలో పాత జంధ్యాన్ని త్యజించి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు.
శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శనిగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు.
మహాలక్ష్మి యెక్కడ కొలువుంటుంది? గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పూలు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇండ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలకి నివసిస్తుంది.
___//\\___ మహాలక్ష్మి కటాక్షసిద్ధిరస్తు - సర్వేజనా సుఖినోభవంతు ___//\\___
కురుక్షేత్రయుద్దం నాటి జనాభ.......
కురుక్షేత్రయుద్దం నాటి జనాభ........
కురుక్షేత్రకాలంలో మనకు తెలిసి జనాభా లెక్కలు వెయ్యలేదు. కనుక నాటి జనాభా వివరాలు ఎవ్వరికీ తెలియవు. నిజానికి మొగలాయిల కాలంలో 4కోట్ల జనాభా అని మన విశ్లేషకులు చెప్పే మాటలకు కూడా ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఒక వేళ వున్నా మొగలాయిల కాలం కన్నా భారతయుద్ధకాలం పాతది కనుక జనాభా ఇంకా తక్కువుండాలన్నదే వీరి వాదన. అసలు వీరు అందరూ అనుకునే విధంగా మొగలాయిల కాలం కంటే తక్కువ జనాభా ఎందుకుండాలి? భారతం జరిగింది ద్వాపర యుగంలో! ఆ యుగంలో ఎందరొ చనిపోగా మిగిలిన అతితక్కువ జనాభాతో కొత్తయుగం (కలియుగం) మొదలయ్యింది అనుకోవచ్చుగా? అదే కదా మన భారతం చెప్పేది కూడా!!? అప్పుడు మహాభారత కాలం కంటే మొగలాయిల కాలంలోనే తక్కువమందే వుంటారు
కురుక్షేత్రయుద్దం నాటి సైన్యం
మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నదని మన పురాణాలు తెలియచేస్తున్నాయి. అయితే అక్షౌహిని అంటే ఎంత అన్న ప్రశ్నకు నన్నయ్య మహాభారత ఆది పర్వంలోని ప్రధమాశ్వాసంలొ 80వ పద్యంలో దాని స్వరూపాన్ని ఈ క్రింది విధంగా వివరించాడు.
ఒక రధము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు కలసిన సైన్యానికి "పత్తి" అని పేరు. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని"సేనాముఖము" అంటారు. సేనముఖానికి మూడు రేట్లను "గుల్మము" అంటారు.ఇందులో 9 రధాలు, 9 ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు "గణము". ఇందులో 27 రధాలు, 27 ఏనుగులు,81 గుర్రాలు,135 మంది కాలిబంట్లుంటారు.గణానికి మూడు రెట్లు "వాహిని". ఇందులో 81 రధాలు,81 ఏనుగులు,243 గుర్రాలు,405 మంది కాలిబంట్లుంటారు.
వాహినికి మూడు రెట్లు "పృతన" ఇందులో 243 రధాలు,243 ఏనుగులు,729 గుర్రాలు,1215 మంది కాలిబంట్లుంటారు. పృతనకు మూడు రెట్లు"చమువు" ఇందులో 729 రధాలు,729 ఏనుగులు,2187 గుర్రాలు,3645 మంది కాలిబంట్లుంటారు.
చమువుకు మూడు రెట్లు "అనీకిని" ఇందులో 2187 రధాలు,2187 ఏనుగులు,6561 గుర్రాలు,10935 మంది కాలిబంట్లుంటారు.అనీకినికి పది రెట్లయితే "అక్షౌహిని" అవుతుంది. అంటే అక్షౌహినిలో 21870 రధాలు, 21870 ఏనుగులు, 65610 గుర్రాలు, 109350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్త్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రధాలు, 3,93,660 ఏనుగులు, 11,80,980 గుర్రాలు, 19,88,300 కాల్బలము అన్నమాట. ఇక్కడ మరో విషయమేమిటంటే ఒక్కొక్క రధం మీద ఒక యుద్ద వీరునితో పాటు ఒక సారధి కూడా ఉంటాడు. కాబట్టి సారధులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రధబలం 7,87,329 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క యుద్ద వీరునితో పాటుగా ఒక మావటి వాడు కూడా ఉంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నిటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పల్గోనట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణులలో పాండవ బలం ఏడు అక్షౌహిణులు మాత్రమే. 8 అక్షౌహిణులు ఒక "ఏకము", ఎనిమిది ఎకములు ఒక "కోటి",(ఈ కోటి వేరు). ఎనిమిది కోట్లు ఒక "శంఖము", ఎనిమిది శంఖములు ఒక "కుముదము",ఎనిమిది కుముదములు ఒక "పద్మము", ఎనిమిది పద్మములు ఒక "నాడి",ఎనిమిది నాడులు ఒక "సముద్రము",ఎనిమిది సముద్రాలు ఒక "వెల్లువ".
అంటే 366917139200 మంది గల సైన్యానికి వెల్లువ అని పేరు. ఇటువంటి 70 వెల్లువల సైన్యం సుగ్రీవుని వద్ద ఉన్నట్లుగ కంబ రామాయణం చెబుతుంది.అంటె సుగ్రీవుని వద్ద 256842399744000 మంది వానర వీరులున్నారన్నమాట. వీరిలొ 67 కొట్ల మంది సైన్యాదిపతులు. వీరికి"నీలుడు" అధిపతి.
Courtesy By +venkatasumakavya hamsakerini

July 25, 2014
భారతీయ ఔన్నత్యం ........ Pierre Sonnerat
శ్రీనివాసుని సంకీర్తనలు.......30
శ్రీనివాసుని సంకీర్తనలు.......30
సింగమై దుమికినాడు శివమెత్తి నాడినాడు
శంఖము మోగించకనే సమరము సాగించినాడు
ఎరుపెక్కిన కళ్ళతో ఎర్రబారెనెవాడు
భారమైన హృదయంతో బరువయెనెవాడు
చిరుమందహాసుడు శివాలెత్తి శివమెత్తినాడు
చల్లనిచంద్రుడు భగభగమండే సూరీడైనాడు
వేచిచూసేవాడు విసుగై విసురుడైనాడే
వెన్నమనసున్నవాడు వేటాడే సింగమైనాడే
నిలువెత్తు నిండుకొండనైన నారాయుణుడు
మహోగ్రజ్వాలాప్రద్యుమ్నుడై మరిగినాడే
ఉడుకెత్తు ఉచ్వాసనిశ్వాసాలతో ఉూగినాడే
అదిరించు బెదిరించు రక్కించు రుద్రనేత్రుడై
మెరుపులను మెరిపించి ఉరుముల్ని ఉరికించి
పీడిగుల్నీ పుట్టించి ప్రళయమును సృస్టించి
నింగినేలపెక్కుటిల్లేల ప్రళయభయంకర రూపుడై
ఎలుగెత్తి పిలివగనే యముడల్లే కదిలి
స్తంభమున సమరమును మోగించి
తొడనెట్టి తీరుతెన్నెలు లేక చీరి
తాపమును తాళలేక తన్దనాలాడే
తిరువెంకట నరసింహుడు ......

శ్రీనివాసుని సంకీర్తనలు.......28
శ్రీనివాసుని సంకీర్తనలు.......28
సప్తగిరి మందిరా ..సిరిహరిసుందరా
కరుణారససాగరా ..కలియుగేశ్వరా ..
ఇక్ష్వాకుల ఈశ్వారా... సకలలోకసర్వేశ్వరా..
హరిహరేశ్వరా.. ఏడుకొండల వెంకటేశ్వరా..
సకల గుణాకరా.. గోకుల గగనాంతరా..
దైత సంహార ..దివిభువి శుభంకరా..
ఆకర ఉకార.. ఓంకార ప్రణవాకారా..
మునిమన మందార.. మోక్ష మహిమాన్యేశ్వరా . .
పాహీమం పాహీమం పద్మావతిప్రాణేశ్వరా...
శరణం శరణం శ్రీస్వర్గలోకేశ్వరా శ్రీవెంకటేశ్వరా..

శ్రీనివాసుని సంకీర్తనలు.......27
శ్రీనివాసుని సంకీర్తనలు.......27
సిరిలచ్చుమమ్మో జర్ర జాగరతనమ్మొ
సీనమ్మై వచ్చి వగలాడుతునాడమ్మో
సీర సుట్టినాది, సింగారించినాది
కాటుక దిద్డినాది , కుంకమ నద్దినాది
ముక్కర మెరిసినాది,లోలాకులు లాడించినాది
ముడి వేసినాది, మల్లెలు ముడిచినాది
గాజులేసీనాది, పట్టీలు పేర్చినాది
బుట్టబట్టినాది, తంబురా తట్టినాది
కుందనపు బొమ్మ కదిలినాది
కొండ దిగినాది కులుకులాడినాది
సోయగాల బొమ్మ సిరి లచ్చుమమ్మ
సోది చెపతానమ్మనని సరసమాడినాది
జరిగి,జరిగే,జరగబోయేది జెపతానమ్మ
గోరి వచ్చేనాధుడి వివరాలు విన్నవిస్తానమ్మ
మనసులోనున్నవాడు మాణీక్యమమ్మా
మనువాడేవాడు మూడులోకాలేలేవాడునమ్మా
సూర్యచంద్రులు సేతిన ధరించినోడమ్మా
సింహమంటి సిన్నోడు సెయ్యబడతాడమ్మ
ఏడుకొండలు దిగివస్తాడమ్మా, వెదుకుకొంటూ వస్తాడమ్మా
మూడు ముళ్ళు వేస్తాడమ్మా, ఏడుఅడుగులు వేస్తాడమ్మా
ఆంటూ
వయ్యారాల వరలచ్చుమమ్మ నీతో వగాలాడినాడమ్మా!
సోయగాల సిరీలచ్చుమమ్మ నీతో సరసాలాడినాడమ్మా!

శ్రీనివాసుని సంకీర్తనలు.......26
శ్రీనివాసుని సంకీర్తనలు.......26
మది మారిపోయింది
మాట మురిసిపోతుంది
మనసే మరలిపోయింది!
తీరని తాపంతోనంది మాధవా ............
రాధను మళ్లీ మళ్లీ చుడవా .........
నంటూ ముందుకు సాగిపోయింది!
కాలం కాసేపు ఆగింది
ఆదమరచి కనురెప్ప వాల్చింది
కమ్మని కలగా కరిగింది...!
తనువె తడబడుతోంది
తుమ్మెదలా ఝుమ్మని ఎగిరింది
ప్రేయసీ ప్రేమనాదం మోగించింది
మది తలుపులు తెరిచింది
ఎదలో తెరలు తొలగించింది
మది మాధవుణి ఉహలతో నింపింది
ఎద రాధమాధవుణి రూపంతో నిండింది!
ఆర్తితో కృష్ణా.......యనికొలచింది
వేణువై ఒడిలో ఒదిగి పొమ్మంది
లీనమై తన జన్మను తరింపజేయమంది !
మది మారిపోయింది
మాట మురిసిపోతుంది
మనసే మరలిపోయింది!
తీరని తాపంతోనంది మాధవా ............
రాధను మళ్లీ మళ్లీ చుడవా .........
నంటూ ముందుకు సాగిపోయింది!
కాలం కాసేపు ఆగింది
ఆదమరచి కనురెప్ప వాల్చింది
కమ్మని కలగా కరిగింది...!
తనువె తడబడుతోంది
తుమ్మెదలా ఝుమ్మని ఎగిరింది
ప్రేయసీ ప్రేమనాదం మోగించింది
మది తలుపులు తెరిచింది
ఎదలో తెరలు తొలగించింది
మది మాధవుణి ఉహలతో నింపింది
ఎద రాధమాధవుణి రూపంతో నిండింది!
ఆర్తితో కృష్ణా.......యనికొలచింది
వేణువై ఒడిలో ఒదిగి పొమ్మంది
లీనమై తన జన్మను తరింపజేయమంది !
శ్రీనివాసుని సంకీర్తనలు.......25
శ్రీనివాసుని సంకీర్తనలు.......25
ఎండిపొఇన కొమ్మ మీద
ఒట్టుబొఇ గట్టులేని చిలకనై
వాడిపొఇ రాలిపోయే ఆకునై
మొడు బారిన మొవినై
వెన్నెల కురవని రేఇనై
మేఘము లేని చినుకునై
నీరులేని ఏరులో నావనై
నిర్యాణమైన తోడులేని నడవిలొ
నిదురరాని నీడలేని నారినై
నెదురుచూచి నారాముడికై
నేరేడుపండ్లుతో నెదురేగితిని
రానె వచ్ఛితీవా రామా
నీరు పోసినావు ఈకొమ్మకు
తేనీరు చల్లినావు తుమ్మెదపైన
నాజన్మ తన్మయత్వముతొ తరించినే రామ....
తీవ్ర పరితాపంతో
ఆశతో కూడిన చూపుతోె,
ఏళ్ళునాళ్ళు స్మరణతో
నాజీవితమే నైవేద్యంగా ,
నాఊపిరెే హారతిగా
నా రామునికి నర్పించు సమయాన
రానె వచ్ఛితీవా రామా. . సీతారామా. . .
జగధభిరామా. . జానకి రామ ..
తీసుకోవయ్యా. . .నను అక్కున చేర్చుకోవయ్యా. .

శ్రీనివాసుని సంకీర్తనలు.......24
శ్రీనివాసుని సంకీర్తనలు.......24
కామి గాక మోక్ష గాము......
వాలు జడ వేసిన, వన్నెల సీర చుట్టిన
మల్లెలు సిగలో ముడిచిన సిన్నదాన్ని
సాకిరేవు బండకాడ సుసినానూరో
సిగ్గుమొగ్గలై సిందులేసినానురో
సూపులేమో ఆగిపోయే ,
మాటలేమో మూగపోయే
మనసేమో మరలిపోయేరో
దాని ఓంపుసొంపుల వయ్యరాలు,
నవరసహొయల నయనాలు,
నా కన్నులకే కలవారమాయె,
నా మదియంతా మురవరమాయే
నన్ను నేను మరిచినాను రో
చెట్టు మాటు చేరి సైగ చేసినానూరో
కాదుగూడదు నంటే ఛీ పోరా సీన్నోడ
మగువల నందాలు మున్నాళ్ల ముచ్చటెరా
మాధవుని శాశ్వితమైన నన్దముచూసి తరించరా
నంటూ మంచి మనసుతో మసులుకొమ్మన్దిరా
సన్యాసము పుచ్చుకొని రామ రామ నంటూ
రూట్ మార్చమన్నాదిరొ
హరిని కొలుచుకొంటూ
సప్తగిరులు చేరి
శ్రీనివాసుని సంకీర్తన చెయ్యమందిరో
ఓ సాకిరేవు బండకాడ సిన్నదాన
నా రూట్ మార్చినావు నా రాత మార్చినావు
కామి గాకనె మోక్షమునకు పంపుతున్నావు!!
కామి గాక మోక్ష గాము......
వాలు జడ వేసిన, వన్నెల సీర చుట్టిన
మల్లెలు సిగలో ముడిచిన సిన్నదాన్ని
సాకిరేవు బండకాడ సుసినానూరో
సిగ్గుమొగ్గలై సిందులేసినానురో
సూపులేమో ఆగిపోయే ,
మాటలేమో మూగపోయే
మనసేమో మరలిపోయేరో
దాని ఓంపుసొంపుల వయ్యరాలు,
నవరసహొయల నయనాలు,
నా కన్నులకే కలవారమాయె,
నా మదియంతా మురవరమాయే
నన్ను నేను మరిచినాను రో
చెట్టు మాటు చేరి సైగ చేసినానూరో
కాదుగూడదు నంటే ఛీ పోరా సీన్నోడ
మగువల నందాలు మున్నాళ్ల ముచ్చటెరా
మాధవుని శాశ్వితమైన నన్దముచూసి తరించరా
నంటూ మంచి మనసుతో మసులుకొమ్మన్దిరా
సన్యాసము పుచ్చుకొని రామ రామ నంటూ
రూట్ మార్చమన్నాదిరొ
హరిని కొలుచుకొంటూ
సప్తగిరులు చేరి
శ్రీనివాసుని సంకీర్తన చెయ్యమందిరో
ఓ సాకిరేవు బండకాడ సిన్నదాన
నా రూట్ మార్చినావు నా రాత మార్చినావు
కామి గాకనె మోక్షమునకు పంపుతున్నావు!!
శ్రీనివాసుని సంకీర్తనలు.......23
శ్రీనివాసుని సంకీర్తనలు.......23
భాష రానివాడనై
భావమున్న వాడనై
భవబంధాలు నొదలక
భవసాగారాన్ని ఈదక
బృందావనము చూడక
భగవద్గీత ననుసరించక
బహుదూరమైన గమ్యాన్ని
బహుసునాయాశముగా ఎంచుకొని
బాధలేన్నో పడుచున్న నాకు
భగవంతుని తీరము దొరుకునా
భాగవతప్రియుని ఆశీస్సులు పొందేనా
భక్తవత్సులుడు బంధం కలుపునా
భక్తమనోహర రూపాన్ని దర్శించేనా!!!!
భాష రానివాడనై
భావమున్న వాడనై
భవబంధాలు నొదలక
భవసాగారాన్ని ఈదక
బృందావనము చూడక
భగవద్గీత ననుసరించక
బహుదూరమైన గమ్యాన్ని
బహుసునాయాశముగా ఎంచుకొని
బాధలేన్నో పడుచున్న నాకు
భగవంతుని తీరము దొరుకునా
భాగవతప్రియుని ఆశీస్సులు పొందేనా
భక్తవత్సులుడు బంధం కలుపునా
భక్తమనోహర రూపాన్ని దర్శించేనా!!!!
శ్రీనివాసుని సంకీర్తనలు.......22
శ్రీనివాసుని సంకీర్తనలు.......22
రామ నామం ఆలపించక రోజు గడవదే
హరి నామం ఆలకించక నా నావ సాగదే
రామనామము కొలవని వేకువలేదే
రామునిరూపము చూడక పొద్దు వాలదే
ప్రతి మాట ఆ రాముని మాట
ప్రతి పూట ఆ రాముని పాట
నా మాట పాట ఆట రామ నామమే
నా భావం గానం ప్రాణం రామ నామమే
నా మనసు మది ఎదా నిండా రాముని రూపమే
నా అక్షరార్చన పదార్చన స్వారార్చన రామ నామమే
నా ఆలాపన, ఆరాధనా, ఆత్మీయ్యగానం ......
అయోధ్య రామునికే , ఆనంద రామునికే ...
అనునిత్యం కొలవాలి ఆ రాముని నామం
అనుక్షణం చూడాలి శ్రీరాముని స్వరూపం !!!
శ్రీనివాసుని సంకీర్తనలు.......20
శ్రీనివాసుని సంకీర్తనలు.......20
హే గంగాతరంగా
హృదయాంతరంగా
శ్రీ రంగరంగా పాండురంగా
మది తలిచె ధ్యానంగా
మనసు పాడెనే మౌనంగా
ఎద మోహనమాయెనే మోహనారంగా
హే జీవనతరంగా
జలధీతారంగా
జనజీవనరంగా పాండురంగా
గగనాన తలుపులు తెరవంగా
గోకులానా గుడిగంటలు మొగంగా
గగనాంతరంగానని గోవిందుని గొలవంగా
వేదన వినరావా వేదాంతరంగా
కరిమేఘుడై కరుణించరావా కరుణాంతరంగా
వరములు వర్షించవా వెంకటరంగా !
హే కొండాంతరంగా
ఏడుకొండల వెంకటరంగా కోనేటీరంగా
నా కనులకు కానరావా అంగరంగా వైభవంగా !
హృదయాంతరంగా
శ్రీ రంగరంగా పాండురంగా
మది తలిచె ధ్యానంగా
మనసు పాడెనే మౌనంగా
ఎద మోహనమాయెనే మోహనారంగా
హే జీవనతరంగా
జలధీతారంగా
జనజీవనరంగా పాండురంగా
గగనాన తలుపులు తెరవంగా
గోకులానా గుడిగంటలు మొగంగా
గగనాంతరంగానని గోవిందుని గొలవంగా
వేదన వినరావా వేదాంతరంగా
కరిమేఘుడై కరుణించరావా కరుణాంతరంగా
వరములు వర్షించవా వెంకటరంగా !
హే కొండాంతరంగా
ఏడుకొండల వెంకటరంగా కోనేటీరంగా
నా కనులకు కానరావా అంగరంగా వైభవంగా !
శ్రీనివాసుని సంకీర్తనలు........19
శ్రీనివాసుని సంకీర్తనలు........19
ఓ కోమలి ఆ కొమ్మలు
నీ కోమలముతో కోలాటాలఆడనేల
ఓ వనమాలి ఆ వెన్నెల
నీ వలపులతో వయ్యారాలనాడనేల
ఓ సుకుమారి ఆ సెలయేరు
నీ సింగారాలతో సరసాలేల
నీ నగమొము నందాలు
నా మనసుని నివ్వెరపరచనేల
నీ గాజుల గలగలలు
నా గుండెలో గిలిగింతలుగానేల
నీ సుమధుర మందార దరహాసాలు
నా మదిలో సుగంధాలై ఓలలాడనేల
నీ పూలరవిక పరువాలు
నా ప్రణయాలను ప్రేమకలాపాలాడించడమేల
ఈ వృందావనములో నీయందాలు
నా వేణువుతో బంధాలువేయనెలా
ఈ సుందరనందనవదనం చూపులు
చిన్నికృష్ణయ్యతో సిందులేఇంచే ఈవేళా!
ఓ కోమలి ఆ కొమ్మలు
నీ కోమలముతో కోలాటాలఆడనేల
ఓ వనమాలి ఆ వెన్నెల
నీ వలపులతో వయ్యారాలనాడనేల
ఓ సుకుమారి ఆ సెలయేరు
నీ సింగారాలతో సరసాలేల
నీ నగమొము నందాలు
నా మనసుని నివ్వెరపరచనేల
నీ గాజుల గలగలలు
నా గుండెలో గిలిగింతలుగానేల
నీ సుమధుర మందార దరహాసాలు
నా మదిలో సుగంధాలై ఓలలాడనేల
నీ పూలరవిక పరువాలు
నా ప్రణయాలను ప్రేమకలాపాలాడించడమేల
ఈ వృందావనములో నీయందాలు
నా వేణువుతో బంధాలువేయనెలా
ఈ సుందరనందనవదనం చూపులు
చిన్నికృష్ణయ్యతో సిందులేఇంచే ఈవేళా!
శ్రీనివాసుని సంకీర్తనలు.....18
శ్రీనివాసుని సంకీర్తనలు.....18
నీ చరణం నాకు శరణ్యం
నీ అభయం నాకు ఆవస్యం
నీ కృప నాకు భాగ్యం
నీ దయ నాకు ధైర్యం
నీ పూజ నాకు పుణ్యం
నీ దర్శనంతో నాజన్మ ధన్యం
ఏకాగ్రతతో కొలిచేను నిన్ను
మనసారా దీవించు నన్ను
కృతజ్ఞతతో మళ్లీ వస్తాను నేను
తిరుమలేశా మొక్కు తీరుస్తాను నేను
ఆ దేవదేవుని చరణారవిందాలకు
ఈ చిన్ని వాని చిన్ని మనవి
ఏడుకొండలవాడ వెంకటరమణ
గోవిందా గోవిందా !!!!!!!!
నీ చరణం నాకు శరణ్యం
నీ అభయం నాకు ఆవస్యం
నీ కృప నాకు భాగ్యం
నీ దయ నాకు ధైర్యం
నీ పూజ నాకు పుణ్యం
నీ దర్శనంతో నాజన్మ ధన్యం
ఏకాగ్రతతో కొలిచేను నిన్ను
మనసారా దీవించు నన్ను
కృతజ్ఞతతో మళ్లీ వస్తాను నేను
తిరుమలేశా మొక్కు తీరుస్తాను నేను
ఆ దేవదేవుని చరణారవిందాలకు
ఈ చిన్ని వాని చిన్ని మనవి
ఏడుకొండలవాడ వెంకటరమణ
గోవిందా గోవిందా !!!!!!!!
శ్రీనివాసుని సంకీర్తనలు......16
శ్రీనివాసుని సంకీర్తనలు......16
వలచి వచ్చినారు
వలపు తెచ్చినారు
పిలుపు నిచ్చినారు
సిగ్గులు ఒదలినారు
సమ్మతము తెలిపినారు
సతులెల్ల చెలిమికొచ్చినారు
వాడివేడి కన్నులతోన
వలువలిప్పిన వెన్నముగ్దలను
విందులార గిన్చమన్నారు
ముగ్దమనోహర రూపముతోన
మాలియలను మురవరముగా
మనసారా ముద్దులాడమన్నారు
సెలయేటి అలలనందాలతోన
చెణుకులాడే సల్లని చిరుగాలై
సకలకళా సరసాలాడమన్నారు
జాబిల్లి జానతణములతోన
జాగరణ జేయాలని
జతజేరగ రమ్మన్నారు !
వలచి వచ్చినారు
వలపు తెచ్చినారు
పిలుపు నిచ్చినారు
సిగ్గులు ఒదలినారు
సమ్మతము తెలిపినారు
సతులెల్ల చెలిమికొచ్చినారు
వాడివేడి కన్నులతోన
వలువలిప్పిన వెన్నముగ్దలను
విందులార గిన్చమన్నారు
ముగ్దమనోహర రూపముతోన
మాలియలను మురవరముగా
మనసారా ముద్దులాడమన్నారు
సెలయేటి అలలనందాలతోన
చెణుకులాడే సల్లని చిరుగాలై
సకలకళా సరసాలాడమన్నారు
జాబిల్లి జానతణములతోన
జాగరణ జేయాలని
జతజేరగ రమ్మన్నారు !
Subscribe to:
Posts (Atom)