July 27, 2014

స్వామీ వివేకానంద సందేశాలు....... (కర్మ రహస్యం)

స్వామీ వివేకానంద సందేశాలు....... (కర్మ రహస్యం)

1. నైతిక ధైర్యంతో ప్రారంభించిన మంచిపనికి ప్రతికూలత ఉంటే, అది ప్రారంభించిన వాళ్ళ నైతిక బలాన్ని మరింత ఉత్తేజ పరుస్తుంది. ప్రతిఘటన, ఆటకం దేనికి ఉండదో అది మానవులను  మృత్యుసదృశ నైతిక పతన మార్గానికి కొనిపోతుంది.

2. మనకు కావలసింది స్పందించే హృదయం. ఆలోచించే మెదడు, పనిచేసే బలిష్టమైన హస్తం. కర్మ చేసే యోగ్యతను సంపాదించు. హృదయానికి --మనసుకి సంఘర్షణ జరిగినపుడు హృదయాన్ని అనుసరించు.

3. మీకు కొద్దిపాటి కల్పనాశక్తి లేకపోతె, మార్గదర్శకమైన ఆదర్శం లేకపోతె, మీరు కేవలం పసుతుల్యులే. కాబట్టి మీ ఆదర్శాన్ని తగ్గించుకోకూడదు. అలా అని అసాధ్యమైన దాన్ని ప్రయత్నించరాదు. ఈ రెండూ విసర్జనీయాలే ! ఉన్నత ఆదర్శంతో ఉత్తమ ఆచరణాన్ని మీ జీవితంలో సమన్వయపరచటానికి ప్రయత్నించండి.

4. మనదేశపు ఆసలన్నీ మీపైనే ఉన్నవి. సోమరులుగా మీరు కాలం గడపటం నాకు బాధను కలిగిస్తోంది. కార్యదీక్షాపరులు కండి. ఆలస్యం చేయవద్దు. అంతా సరియైన సమయంలో జరుగుతుందని సోమరులుగా కూర్చోవద్దు. ఆ విధంగా ఏ పనీ నేరవేరదని గుర్తుంచుకోండి.

5. వ్యర్థకాలయాపన పనికి రాదు. అసూయ, అహంకారం అనే భావాలను పూర్తిగా విడిచిపెట్టండి. అప్రతిహతమైన శక్తితో కార్యరంగంలోకి దూకి సాహసవంతులుగా పని చెయ్యండి.

6. నా ఉద్వేగం మీకింకా ఒంటబట్టలేదు. నన్ను మీరు అర్థం చేసుకోలేదు. సోమరితనం, సుఖనుభవం అనే పాతపంథాలలోనే మీరింకా పరుగెత్తుతున్నారు. ఈ అలసత్వం ఇక చాలు. ఇహపర ఫలభోగాసక్తి ఇక చాలు.

7. మీరు నా ఉద్వేగాని అందుకోవాలని, అత్యంత నిష్కపటవర్తనులవ్వాలని నా నిరంతర ప్రార్థన.


No comments:

Post a Comment