July 25, 2014

శ్రీనివాసుని సంకీర్తనలు......11

శ్రీనివాసుని సంకీర్తనలు......11

సిరులుగిరుల సిన్నోడే సూడసక్కనోడే
సప్తలోక సుందరాంగుడే సప్తగిరి శ్రీనీవాసుడే

సూదంటి సూపులతో సక్కలిగింతలె పెడుతున్నాడే
సందేలకొచ్చినాడే సందమామను తెస్తనన్నాడే

ప్రేమ, ప్రణయమంటూ వెంటబడ్డాడే
సావాసమంటు సరసాలు సెయ్యమన్నాడే

సిగ్గాయెనే, మొగ్గాయెనే - బుగ్గేమో ఎరుపాయెనే
బెరుకాయెనే సురుకాయెనే మనసేమో బరువాయేనే

తప్పుతప్పురాసామినంటే తాళలేనన్నడే
కాదుగూడదంటే తిరుమలగిరులు రాసిస్తనన్నడే
మాఅయ్య ఒప్పుకోడంటే మంగా మనువాడతానన్నడే

ముత్యాలపందిరిలో ముచ్చటగా మూడుముళ్ళు వేసినాడే
మున్నాళ్లకే మూడునామాలవాడు మాయమై పోనాడే
ఏడేడుకొండలెక్కి ఏడుకొండలవాడై వెలిసినాడే!....... 


No comments:

Post a Comment