July 25, 2014

శ్రీనివాసుని సంకీర్తనలు......12

శ్రీనివాసుని సంకీర్తనలు......12

లచ్చుమక్క లచ్చుమక్క లచ్చుమక్కో 
మాయదారి మలయప్పను చూసినానక్కో

కొండమీద నున్నాడు లచ్చుమక్క
కోనలోన దాగినాడు లచ్చుమక్క

వచ్చేవారు, పోయేవారు సందులేరక్క
ఇచ్చుకోనేవారు పుచ్చుకొనేవారు ఎందరోనక్క

కోరికలు కోరేవారు కోకల్లలక్కా
కొదువలేక కరిమేఘుడై కరుణిన్చుతున్నాడక్క

పరమాత్మాయని పాదాలకు మొక్కుతున్నారక్క
సర్వాంతరయామియని సకలసేవలు చేయుచున్నారక్క

హరివిల్లులతొ రంగవల్లులు వేసినారక్క
రంగరంగ వైభవంగా రంగనాధుని నలంకరించినారక్క

కోటికాంతులతో కమలనాధుడు కళకళలాడుచున్నాడు
వెండికొండలపై వెన్నలై విరాజిల్లుతున్నాడక్క

ఏమిసెప్పనక్కా వేంకటేశుని వింతవింతలక్క
ఎన్నిజన్మలైన చాలవు వర్ణిన్చడానికక్కా

ఏడుకొండలకు ఒక్కసారి వెళ్ళొద్దామక్కా
వెంకటవిభుని వైభవాలు చూసివద్దామక్కా......



No comments:

Post a Comment