July 25, 2014

శ్రీనివాసుని సంకీర్తనలు.......26

శ్రీనివాసుని సంకీర్తనలు.......26

మది మారిపోయింది
మాట మురిసిపోతుంది 
మనసే మరలిపోయింది!

తీరని తాపంతోనంది మాధవా ............
రాధను మళ్లీ మళ్లీ చుడవా .........
నంటూ ముందుకు సాగిపోయింది!

కాలం కాసేపు ఆగింది
ఆదమరచి కనురెప్ప వాల్చింది
కమ్మని కలగా కరిగింది...!

తనువె తడబడుతోంది
తుమ్మెదలా ఝుమ్మని ఎగిరింది
ప్రేయసీ ప్రేమనాదం మోగించింది

మది తలుపులు తెరిచింది
ఎదలో తెరలు తొలగించింది
మది మాధవుణి ఉహలతో నింపింది
ఎద రాధమాధవుణి రూపంతో నిండింది!

ఆర్తితో కృష్ణా.......యనికొలచింది
వేణువై ఒడిలో ఒదిగి పొమ్మంది
లీనమై తన జన్మను తరింపజేయమంది !



No comments:

Post a Comment