July 24, 2014

శ్రీనివాసుని సంకీర్తనలు....... 03

శ్రీనివాసుని సంకీర్తనలు....... 03

కార్తీక పౌర్ణమి రోజు
కోయలై కూసింది
కోటిరాగాలు పలికింది 
కోటికాంతులు చిమ్మింది

విహంగమై విహరించి
వేణువులో చిక్కింది
మోహనరాగమై మురిసింది
అబాలగోపాలాన్ని మురిపించింది

పున్నమిలా పూచింది
పురివిప్పి ఆడింది
ప్రాణమై ప్రేమించింది
పరమాత్ముని పరవసింపజేసింది

నా కలం నా గళం
ఏడుకొండలవాడ వెంకటరమణా
గోవిందా గోవింద!



No comments:

Post a Comment