July 24, 2014

శ్రీనివాసుని సంకీర్తనలు..... 06

శ్రీనివాసుని సంకీర్తనలు......06

మన్ను తినకురా ముకుందా
వెన్న తినరా గోవిందా
మారాము చెయ్యకురా ముకుందా
మాట వినరా గోవిందా
అండాండ బ్రహ్మాండాంబులు దాచిన
ఆకలిగొన్న ఆచిన్ని బొజ్జనుచూచి

అమ్మ మనసు అలమటించెరా
వేళాయెనని చల్ల తెచ్చెరా

వింత వింతలు జేయకురా
మహిమలెన్నో జూపకురా

కన్న తల్లిని మాయ జేసి
కన్ను కాంచక మన్ను తినకురా మురారి

కన్నతల్లి చేతి గోరుముద్దలు ముద్దులు రా
వెన్న ముద్దలు నారగించరా నాద మురారి

కడుపునిండిన కలువకన్నులలో ఆనందం
కన్న మనసుకు మహాదానందం

పెంచిన ప్రేమకు పరమానందం
అమ్మ పంచే ఆత్మీయ్య బంధం

జయ కృష్ణా ముకుందామురారి
జయ గోవింద గోవింద గానవిహారి!.........


No comments:

Post a Comment