July 25, 2014

శ్రీనివాసుని సంకీర్తనలు.....09

శ్రీనివాసుని సంకీర్తనలు.....09

దండాలు దశరధరామ 
వేయి దండాలు నీకు కోదండరామా

రామపాదుకలతో భరతుడేలిన రాజ్యమున
రావణాసురుల రాక్షసకేళిలుతో
నవనారి సీతల మానాలు మంటకలిసిపోతుంటే

అక్షయపాత్రతో పంచభక్ష్యపరమాన్నాలు వడ్డించిన
కాశీ అన్నపూర్ణేశ్వరి దయగల్గిన పవిత్ర భారతాన
అన్నమో రామచంద్రా అన్న
ఆకలికేకలుతో అలమటించి పోతుంటే

ఆదుకొనేవాడు లేక ఆపేవాడు లేక
పాలించేవాడు లేక పట్టించుకొనేవారు లేక

రక్షించు రామచంద్రప్రభోనన్న
 రక్షించేవారు లేక
దయచూపు ధర్మప్రభోనన్న దారిచూపేవారు లేక
భయంతో బిక్కుబిక్కుమంటోంది నా భారతమాత

విన్నా వినరాని న్యాయగాంధారిలా
కన్నా కనరాని కలియుగగాంధారిలా
నాకేంటినన్న 
నవభారతనవయుగ సమాజామును చూచి 
వేదనతో విలవిలలాడుతోంది నా భారతమాత

రా కన్నభూమికై కదలిరా కౌసల్యరామ
రా దివినుంచి భువికేగరా దశరధారామ

ధర్మాన్ని రక్షించరా రామ
నాదేశాన్ని కాపాడరా రామ

శరణుశరణు శ్రీరామ
ధర్మమో దశావతారకరామ

దండమో దశరధరామ
వేయి దండాలు నీకు కోదండరామా....... 



No comments:

Post a Comment