July 24, 2014

శ్రీనివాసుని సంకీర్తనలు....... 04

శ్రీనివాసుని సంకీర్తనలు....... 04

అలిమేలు అలుగకే
కలువన దాగకే
అందము దాయకే 
కలవర పెట్టకే 

నాడలేదు నే నాంచారితో
నమ్మవే నీ నాథుడని

నడిరేయిన నొప్పించకె
నందాలతో మెప్పించవే

కోరి కోరి వచ్చానే
కలువరేకులు తెచ్చానే

ఏకాంత సమయాన
నీఅందాల అంతఃపురమున

అనురాగముతో ఆదరించి
అలరించి అబ్బురపరచవే

భక్తులు బారులుతీరిరే

బృందాలై భజనలుచెసిరే

కోలాటమాడినారు కనులుగప్పినారు
కోర్కెలన్ని కోరి కరుణించమన్నారు

ఏడుకొండలవాడ వెంకటరమణ
గోవిందా గోవిందా యని ఏమార్చినారు..... 



No comments:

Post a Comment