గణేశ మంగళ హారతి
1, గణేశ మంగళం విఘ్నేశ మంగళం
ఈశపుత్ర బ్రహ్మసూత్ర బద్ధ మంగళం
సిద్ది బుద్ధి మంగళం
2, విశ్వ మంగళం గజవక్త్రమంగళం
మందహాస గుజ్జురూప పూజ్యమంగళం
ఆదిపూజ్యమంగళం
3, అజేయ మంగళం మునిధ్యేయ మంగళం
చారు సుందరాకార శోభ మంగళం
నిత్య శోభ మంగళం
4, దంతిమంగళం ఏకదంతమంగళం
విష్ణు నామ లంబోదర జ్ఞాన మంగళం
జ్ఞాన రూపమంగళం
5, యోగి మంగళం ఉమాపుత్ర మంగళం
గుణాతీత గణాధ్యక్ష వరద మంగళం
భక్త వరద మంగళం
6, భీమ మంగళం అనంతాయ మంగళం
ప్రమధేశ్వర అచ్యుతాయ నాదమంగళ
ప్రమధనాధమంగళం
7, దక్ష మంగళం విశ్వరక్ష మంగళం
అఘువాహన విఘ్ననాశ సర్వమంగళం
సర్వ సృష్టి మంగళం
8, ఈశమంగళం వాగీశమంగళం
వరసిద్ధి వినాయకాయధీరమంగళం
నిత్య సత్య మంగళం,
9, బుద్ధిమంగళం కార్యసిద్ధిమంగళం
మల్లికాకుసుమగాన ప్రధితమంగళం.
కర్పూర మంగళం,కర్పూర మంగళం