1. గణనాధునికి అక్షరమాల
గీత రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి ఆచంట శ్రీదేవి
1, అగణిత గుణగణ గణపయ్యా
ఆనందాశ్రిత గణపయ్యా
ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డవు
ఈశ్వర పుత్రాగణపయ్యా,
2, ఉధృత నాట్య ఉండ్రాళ్ళ భోక్త
ఊహాతీతాస్కందుని భ్రాతా
ఎలుక పైన నీ ప్రయాణము
ఏనుగు ముఖమే నీ వినోదము,,
3, ఐశ్వర్య ప్రద అమృత హృదయా
ఒనరించెదము మొదటి పూజను
ఓయనిఅని పలికే గణనాయకుడా
ఔదల దాల్చి వరములీయరా
4, అందరూ కొలిచే అమర వందిత
అంతట నీవే ఉన్నావయ్యా
అఃహా నీకే జేజేలయ్యా
అఃహా మమ్ముల కృప జూడవయ్యా
No comments:
Post a Comment