September 26, 2023

శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం

 7. శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం - నిరుపమ & ప్రవళ్ళిక 


శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం

శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమాం



శూర్పకర్ణ చంద్రవర్ణ శ్రీ గణేశ పాహిమాం

కరుణాలయ శరణాగత శ్రీ గణేశ పాహిమాం

ఈశపుత్ర నాగసూత్ర శ్రీ గణేశ పాహిమాం

ప్రణవరూప సంపత్కర శ్రీ గణేశ పాహిమాం



చతురాననాదివంద్య శ్రీ గణేశ పాహిమాం

ఆది పూజ్య శివ కుమార శ్రీ గణేశ పాహిమాం

అగజానన అప్రమేయ శ్రీ గణేశ పాహిమాం

ఏకదంత లంబోదర శ్రీ గణేశ పాహిమాం



ఫాలచంద్ర వక్రతుండ శ్రీ గణేశ పాహిమాం

విఘ్ననాశ వేదవేద్య శ్రీ గణేశ పాహిమాం

చిత్రరత్న విచిత్రాంగ శ్రీగణేశపాహిమాం

కామరూప ధర దేవా శ్రీ గణేశ పాహిమాం


కళాధరా వతంసక శ్రీ గణేశ పాహిమాం

కామితార్థ ఫలదాయక శ్రీగణేశ పాహిమాం

సామగాన నాట్యలోల శ్రీ గణేశ పాహిమాం

మోదకప్రియ సురేశ శ్రీగణేశపాహిమాం

దుర్వాయుగ్మ పూజ్య శ్రీగణేశపాహిమాం

అక్షర కుక్షివినాయక శ్రీ గణేశ పాహిమాం

పార్వతీ ప్రియ నందన శ్రీ గణేశ పాహిమాం

మధుర మధుర నామాక్షర శ్రీ గణేశ పాహిమాం

మల్లికా కుసుమ గాన శ్రీ గణేశ పాహిమాం


ఏక వింశతి స్తవనీయ శ్రీ గణేశ పాహిమాం

No comments:

Post a Comment