4. సిద్ధివినాయకం ప్రణమామ్యహం
సిద్ధివినాయకం ప్రణమామ్యహం
గౌరీ నందనం ప్రణవరూపం
1.నిత్య నూతనం సత్య సనాతనం
సర్వ విశుద్ధ నిర్మలాకృతిం
నిర్వికల్ప చిదానంద ఘన
మాయాతత్వ భేదన చతురం
2. ఆదిపూజితం శరవణాగ్రజం
నాగసూత్ర యజ్ఞోపవీతం
మధుర హసితం నిత్య సుఖదం
సరస సంగీత నాట్య కళానిధిం
3. మూషిక వాహనం విఘ్ననాశనం
సిద్ధి బుద్ధి స్వరూపానందం
జ్ఞానానంద సుధా మకరందం
మల్లికా కుసుమ హారభూషణం
No comments:
Post a Comment