2. గిరి నందినీసుతా విఘ్నేశ్వరా
గీత రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి
గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి
ప. గిరినందినీసుతా విఘ్నేశ్వరా
అ.ప. నీ పుట్టుకే చిత్రము ఓంకార నీ రూపమే చిత్రాతి చిత్రము
1, నీ తండ్రి వాసము వెండి కొండ
మీ తాత ఘనమైన మంచుకొండ
నీ తండ్రి మిత్రుడు ధనములకు అండ
మాకేమి కొరతరా మాచెంత నీవుండ ,,,,గిరి నందిని,,
2, నీ సోదరునికి ఆరుతలలు
నీ తండ్రి కున్నవట మూడు కన్నులు
నీకు శ్రీకరమైన కరివదనము
నిన్ను మోయగలేని మూషికము వాహనము,, గిరి నందిని,,
3, సంగీత సాహిత్య నాట్య ప్రదాత
నీ తల్లి చరితయే నీకు ఘనత
నీ చేతి వ్రాతయే వ్యాస గీతా
నవ మల్లికా కుసుమ గాన చరిత ,,గిరి నందినీ,,,
No comments:
Post a Comment