September 23, 2023

జయ జయ జయ గణనాథా

 జయ జయ జయ గణనాథా 

గీత రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి

గాయకులు - విద్యాసాగర్ & సింధూజ 

జయజయ జయజయ గణనాథ

జయ జయ జయ జయ గణనాథా

జయ జయ జయ జయ గజవదనా

 

జయ లంబోదర విఘ్న వినాశక

మూషిక వాహన ముని జన వందిత 

గిరిజా నందన మునిగణసేవిత

మంగళదాయక మోదక ప్రియా  

 

చామర కర్ణ విలంబిత సూత్ర

భక్తజన ప్రియ షణ్ముఖ సోదర 

సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక

ఏకదంతభవ అనేకదంతా

No comments:

Post a Comment