8. గణనాయకునికి లాలి పాట
లాలి గిరిజా తనయ లాలి శివ తనయా
లాలి పంకజ నేత్ర లాలి శుభ గాత్ర
లాలంచు ఎల్లరును జోల పాడంగా
ముక్కోటి దేవతలు తొట్టి నూచంగా
రంభ ఊర్వసులెల్ల నాట్యములు చేయ
నారదా తుంబురులుగానములుచేయ
బంగారు తొట్టెలో మల్లె పువ్వులు పరచి
లాలి లాలీ అనుచు నిన్ను ఊచెదము
నీ తండ్రి వేడుకతో నిన్ను వీక్షింప
తూగుటుయ్యాలలో పవళింపవయ్యా
ఉండ్రాళ్ళు కుడుములు నీకు పెట్టెదము
పాలు పరమాన్నములు పంచి పెట్టెదము
చందురుడు నవ్వునని ఆరాటపడకు
కార్తికేయుడు నీకు తోడుండగలడు
నీ తల్లి దీవెనలు నీకు రక్షలురా
నీ తండ్రి దీవెనలు నీకు లక్షలురా
మల్లికా కుసుమముల పాటలను పాడి
జోలపాడెద నీకు చిన్ని నాతండ్రీ
No comments:
Post a Comment