September 23, 2023

సిద్ధి వినాయకం బుద్ధి ప్రదాయకం

 6. సిద్ధి వినాయకం బుద్ధి వినాయకం

గీత రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి

గానం - శ్రీమతి ఆచంటశ్రీదేవి 

సిద్ధి వినాయకం బుద్ధి ప్రదాయకం

సిద్ధ సురాసుర వందిత చరణం


కాశీ నిలయం డుండి వినాయకం

గిరిజా తనయం వక్రతుండం

స్కంద పూర్వాగ్రజం నాట్య సుందరం

సంగీత సాహిత్య సానంద రూపం


మూషిక వాహనం మునిగణ సేవితం

సంకట హరణం విఘ్నవారణం

కలుష విదూరం షణ్ముఖ సోదరం

పాపక్షయకరం మోదకప్రియం


నాగసూత్ర శోభితం శశివర్ణ విరాజితం

సకల శాస్త్ర సన్నుతం పాహి పాహి గణపతిం 

No comments:

Post a Comment