April 22, 2013

మానవ ధర్మాలు:--

మానవ ధర్మాలు:--

1) మనిషిని జీవింపచేసేవి:- నిగ్రహం, ప్రేమ, తృప్తి, త్యాగము.

2) మనిషిని దహింపచేసేవి:- అసూయ, అత్యాశ, ద్వేషం, పగ.

3) జీవితానికి చెరుపు తెచ్చేవి:- అధికారం, అహంకారం, అనాలోచన.

4) జీవితంలో ఆసించకూడనివి:- అప్పు, యాచన.

5) జీవితంలో చేయకూడనివి:- వంచన, దూషణ.

6) నేర్పరికి కావలసినవి:- లక్ష్యం, సహనం, వినయం, విధేయత.

7) పరువు-ప్రతిష్టలకు భంగం కలిగించేవి:-వ్యామోహము, స్వార్ధము, హింస.

8) మనిషి ఆచరించదగినవి:- ధర్మము, దయ, దానము, ధ్యానము, క్రమశిక్షణ, సత్యవ్రతము, మౌనవ్రతము.

9) మనిషి కోరుకోదగినవి:- అందరి క్షేమము.


10) మనిషి తనకు తానుగా చేయవలసినవి:- ఆత్మ విమర్శన, ఆత్మ రక్షణ.


11) మనిషి కాపాడుకోవలసినవి:- ఆత్మాభిమానం, శీలం.


12) మనిషిని పట్టి పీడించేవి:- అనుమానం, అసూయ, అపనమ్మకం.


13) మనిషిని కష్టాలనుండి కడదేర్చేవి:- విజ్ఞానం, వివేకం, ధైర్యం.


14) మనిషిగా పుట్టినందుకు చేయవలసినవి:- పరోపకారం, దైవచింతన.


15) మనిషి ఉత్తమునిగా ఉండుటకు చేయవలసిన ముఖ్యమైన పనులు:- క్రమశిక్షణ, బాధ్యతగా మెలుగుట, లక్ష్యం, సహనం...మొదలగునవి..


16) మనిషి పూజించదగినవారు:- తల్లిదండ్రులు, గురువు, దైవము, అతిధి, పరస్త్రీ......








No comments:

Post a Comment