April 26, 2013

నిత్య ప్రార్థనా విధానం:-

నిత్య ప్రార్థనా విధానం

కరుణామూర్తి యగు ఓ సర్వేశ్వరా ! మా చిత్తము సర్వకాల సర్వావస్తలయందు నీ యందే ఉండునట్లు అనుగ్రహించు తండ్రీ. వేదాంతవేద్యా అభయ స్వరూప, మా మనస్సు నందు ఎన్నడును ఎట్టి దుష్ట విషయ సంకల్పము కాని, ఈర్ష్య ద్వేషాలు కాని కలుగకుండునట్లు అనుగ్రహింపుము తండ్రీ... మా వలన ఎవరికిని ఎట్టి అపకారము జరగకుండునట్లు మరియు ఇతర ప్రాణికోటికి ఉపకారము చేయు సద్బుదిని ప్రసాదింపుము తండ్రీ.... మా అజ్ఞానము నశించి, ఈ జన్మమునందే కడతేరి నీ సానిధ్యమునకు ఏతెంచుటకు వలయు భక్తీ--జ్ఞాన --వైరాగ్యములను ప్రసాదించుము.... అన్యధా శరణం నాస్తి......... రక్షమాం రక్షమాం రక్షమాం...... మాకు పవిత్రమైన మానవ జన్మనిచ్చి, కొంతైనా సంస్కారము ఇచ్చినందుకు.... ధన్యవాదములు...... అని ఎవరిస్టమైన దైవాన్ని వారు ఈ విధంగా ప్రార్ధించుకోవాలి ఇది మన పెద్దలు చెప్పిన సాంప్రదాయం...ఈ విధంగానే రాత్రి పడుకునే ముందు & ఉదయము లేచినప్పుడు భగవన్నామ స్మరణ చేసుకోవాలి .....




No comments:

Post a Comment