April 22, 2013

స్నానము చేయునపుడు చదవవలసిన శ్లోకం:-

స్నానము చేయునపుడు చదవవలసిన శ్లోకం:-

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి 
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||

భావం:-
ఓ గంగా, యమునా, గోదావరీ, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరి, నదీమతల్లుల్లరా ! నేను స్నానమాచరించుచున్న జలమునందు ప్రవేసింపగోరుచున్నాను.....



స్నానము చేసిన తరవాత సూర్యునకు నమస్కరిస్తూ ధ్యానించవలసిన శ్లోకం:-

బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం l 
సాయం ధ్యాయేత్ సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ ll 

భావం:-
సూర్యభగవానుని ఉదయకాలమందు బ్రహ్మస్వరూపముగాను, మధ్యాహ్నము నందు మహేశ్వరునిగను, సాయంకాలము నందు విష్ణు రూపునిగాను ఇట్లు త్రిమూర్తుల రూపముగా భావించి, నమస్కరించవలెను.....



No comments:

Post a Comment