మంచి మాటలు
ఎన్ని పూజలు, నోములు, వ్రతాలు చేయువారైన---దానబుద్ధి లేనిచో.. జీవితము ధన్యము కాదు. సత్కర్మలు చేయువారు కోపము తెచ్చుకొనినచో పుణ్యకర్మ ఫలము నశించును.
మారేడు దళమునకు మధ్య దళము --శివుడనియు, కుడివైపు దళము --విష్ణువనియు, ఎడమవైపు దళము --బ్రహ్మ అనియు తెలుసుకోవలెను...
మారేడు దళము కాశీ క్షేత్రముతో సమానము.. మారేడు చెట్టు ఉన్నచోట శివుడు లింగ రూపమున నివసించును..
మారేడు చెట్టు ఇంటికి ఈసాన్యనమున ఉంటే--ఐశ్వర్యము కలుగును, తూర్పున ఉంటే --సుఖము కలుగును, పడమరన --పుత్రసంతానము కలుగును, దక్షిణమున ఉన్నచో --యమబాధలు ఉండవు.....
No comments:
Post a Comment