ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ఈ రోజున మనమంతా ఆరోగ్యదినోత్సవం జరుపుకోవాలంట.........తెలిసిందా మిత్రులారా.......అంటే మనం ఈ ఒక్క రోజు ఆరోగ్య నియమాలను పాటిస్తే మిగిలిన రోజులు పాటించనవసరం లేదనా.....
మనం మన ఆరోగ్యం కాపాడుకోవటానికి కొన్ని నియమాలని పాటిస్తే ప్రతీ రోజూ ఆనందంగా ఉండవచ్చు కదా ! ఆ నియమాలులో నాకు తెలిసిన కొన్నిటిని మీకు తెలియచేస్తాను....
తలకు స్నానం చేసేముందు---- మాడుకు చమురు(నూనె) పెట్టి, వంటికి నూనె రాసుకుని, నలుగుపెట్టి స్నానం చేస్తే, కేశ సంరక్షణ బావుంటుంది, నూనె -- పిండి కలిపి నలుగు పెట్టటం వల్ల శారీరిక వ్యాయామము అవుతుంది, శరీరానికి కాంతి పెరుగుతుంది ...
పూర్వ కాలంలో-- కంటికి కాటుక, కాళ్ళకు పసుపు నిండుగా ఉండేవి, ఈ రోజుల్లో అవి కరువు అవ్వటం వల్ల---కంటికి జోడు, కాళ్ళకి జోడు తప్పనిసరి అవుతున్నాయి.
పిల్లలకు ఉదయాన్నే నూనెతో చేసిన ఫలహారాల కన్నా--పెరుగన్నం పెడితే వారికి ఆలోచనాశక్తి పెరుగుతుందంట..
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా భోజన విషయంలో కూడా మా చిన్నతనంలో, ఒక రోజు ఉసిరిక పచ్చడి మొదటి ముద్దలో తింటే ఇంకో రోజు నిమ్మకాయ, ఓరోజు శొంటి పొడి, మరో రోజు వాము పొడి తినేవాళ్ళము---
మరి ఇటువంటి పద్దతులు ఈ రోజుల్లో కూడా ఆచరించగలిగితే,అందరూ కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతామేమో
ఏ కాలంలో వచ్చే ఫలాల(fruits)ను, ఆ కాలంలో తినాలి...
మనం నడవగలిగిన దూరం నడిస్తే అదీ కూడా ఆరోగ్యమే...
గాలి, నీరు, ఆహారపదార్థాలు అన్నీ కల్తీమయమవుతున్న ఈ రోజుల్లో మన ఆరోగ్య సంరక్షణ మనమే చూసుకోవాలి..
వెనుకటి రోజుల్లో ఊరుకో దేవాలయం అనేవారు----కానీ ఇప్పుడు వీధికో వైద్యాలయం అని చెప్పుకుంటున్నాం..
ఇదివరకు రోజుల్లో వస్తు మార్పిడి ఉండేది----ఇప్పుడు అవయవ మార్పిడి వచ్చింది.... అందుకే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది....
----------------"ఆరోగ్యమే మహాభాగ్యం"------------
No comments:
Post a Comment