June 23, 2013

వీర్రాజు గారి పద్యములు--11.నుండి 20 వరకు

 11 వ పద్యము.

ధన మదము తోడ పెరుగుచు 
దినమొక పరకాంత తోడ దిరుగగ తలచున్ 
తనవారి నెవరు తాకిన
ఘనముగ దండించ జూచు కనుడీ నిజమున్ ll 


12 వ పద్యము.

పరులకు సాయము చేయక 
తరతమ భేదంబు మరచి దంభము తోడన్ 
పరకాంతల పొందు కొరకు 
నిరతము యోచించువారు నీచులు పుడమిన్ ll 


13  వ పద్యము.

మెప్పును పొందగ నీవున్ 
అప్పులు చేయకెపుడైన నసమర్థునిగా 
నొప్పరు ఎవ్వరు నినుగని 
తప్పును పట్టిన ఇనుముగ తుదకున్ మారున్ ll 


14 వ పద్యము.

పాముకు పాలును బోసిన 
ఏమగునో తుదకు నీవు నెరుగుదువంటిన్
పామరులకు సాయపడిన 
పామువలెను కాటువేయు పొంచియు జూచున్ ll  


15 వ పద్యము.

నీతిని విడువకు మెప్పుడు 
జాతిని దూషించబోకు చాలగనీవున్ 
పాతిన మొక్కను పెంచిన 
రీతిగ నీజాతి పెంచు ప్రీతిని విడకన్ ll  


16 వ పద్యము.

మోసము చేసెడివారికి 
నాశము తప్పదు తుదకును నవ్వులపాలే 
ఆశకు లోబడకెపుడు దు 
రాశయె నీ జీవితమును నంతయు చేయున్ ll


17 వ పద్యము.

విచ్చిన రోజా పువుగని 
మెచ్చును మనసెంతగానో మేనును మరచున్ 
నచ్చియు కోయగ బూనిన 
గుచ్చుకొనును కచ్చితముగ గురిగా ముల్లుల్ ll


18 వ పద్యము.

తుంటరి స్నేహము చేసిన 
తుంటరి తనమే అలవడి ద్రోహిగ తిరుగున్ 
అంటెడు వ్యాధివలెను అది 
అంటుకు పోవును మనిషికి హానిని తెచ్చున్ ll


19 వ పద్యము.

చేయకుమీ చెడు స్నేహము 
మోయకుమీ తలకుమించు మోపును నెపుడున్ 
దాయకుమీ నిజమెపుడు 
దోయకుమీ పరధనమును దోషము సుమ్మీ ll


20 వ పద్యము.

వీడకుమీ నీవారిని 
పాడకుమీ రానిపాటని పదుగురి ఎదుటన్ 
అడకుమీ అనృతంబును 
జూడకుమీ ఆశతోడ సుందరి నెపుడున్ ll 



No comments:

Post a Comment