June 23, 2013

వీర్రాజు గారి "సూక్తి సుమమాల" పద్యములు 71 నుండి-- చివరి పద్యం 84 వరకు.

 71 వ పద్యము.

పెట్టినవారిని తిట్టుచు 
కొట్టగ జూడదగదు సుమ కోపము తోడన్ 
పెట్టిన కోరకు ప్రతిఫల 
మెట్టిది యేనాడు నీవు నెవ్వరి చెంతన్ ll  


72 వ పద్యము.

కమ్మని మాటలు చెప్పుచు 
నెమ్మదిగా పూటగడుపు నేర్పురులయితే 
ఇమ్మహిలో వీరినెవరు 
పొమ్మను వారుండరసలు పోకిరి అయినన్ ll 


73 వ పద్యము.

కోపము విడచిన మనిషికి 
ఆపద రాదెపుడు నిజము ఆశ్చర్యంబౌ 
ఓపిక వహించిన నిలచిన 
పాపడుగా పరిగణింత్రు పదుగురి లోనన్ ll 


74 వ పద్యము.

రెండే జాతులు ఈ ధర 
నుండే స్త్రీ పురుషులనుట వట్టిది కాదే 
మెండుగ జాతుల కడును 
ద్దండులు నేర్పరిచినారు తమ మేలునకై ll 



75 వ పద్యము

కొండలు పిండిగ మార్చియు 
నుండెడి తీరును సహితము నొకపరి కనకన్ 
కండలు కరగించిన మరి 
తిండికి కరువేల కలిగె తెలియగ నరుకున్ ll 


76 వ పద్యము.

ఒండొరుల గాంచరేలను 
దండిగ ధనమున్నవారు ధరలో ఎపుడున్ 
కొండంత ఆశతోడను 
ఉండెడి పనివాడు తినని ఉనికిని కనరే ll 


77 వ పద్యము.

చుట్టము వచ్చిన ఇంటికి
పెట్టుటకును జూడరేమి పెన్నిధియున్నన్ 
మెట్టిన ఇంటికి వచ్చిన 
పెట్టగ భయపడును పడతి పెద్దలకయినన్ ll  


78 వ పద్యము.

పెట్టకపోయిన తిండియు 
కొట్టకుమీ భార్యనెప్పుడు కోపము తోడన్ 
కొట్టినను గాని నిన్నున్ 
కొట్టగ నుండదు తిరిగియు కనవే మదియున్ ll  


79 వ పద్యము.

తిట్టిన మాటాడదసలు 
కొట్టిన నిను కొట్టదెపుడు కొరకొర జూచున్ 
అట్టి సతినేల కొట్టగ 
ఎట్టుల మనసొప్పనుండు ఎవరికి అయినన్ ll 


80 వ పద్యము.

అష్టైశ్వర్యములున్నను 
పుష్టిగ తిననేర్వరేమి పుడమిని నరులే 
ఇస్తంబున్నను లేకను 
కష్టపడితినంగ జూచు ఘనులున్ పుడమిన్ ll  


81 వ పద్యము.

పేదకు నాపద వచ్చిన 
ఆదుకొనరు గొప్పవారు అదియేమొ కనన్ 
భేదము చూపక మానరు 
రాదా యిక సమత మనకు రానేరాదే ll 


82 వ పద్యము.

కీర్తిని కోరియు నీవును 
ఆర్తజనుల చూడకున్న అపరాధంబే 
ధూర్తులకును సాయపడిన
కీర్తియు రాదిల తుదకపకీర్తే వచ్చున్ ll  


83 వ పద్యము.

స్వార్థంబేలను విడువవు 
వార్ధక్యములోన కూడ వగచుటయేనా 
గార్ధభము వలెను గడువకు
మార్థిక బలముండి కూడ అందరి తోడన్ ll  


84 వ పద్యము.

ఉన్నది అంతయు యిమ్మని 
ఎన్నడునే జెప్పలేదు ఎవరికి నయినన్ 
ఉన్నది తినగా మిగులును 
కొన్నపుడే ఇవ్వమందు కూరిమి తోడన్ ll  

No comments:

Post a Comment