"అత్తా --కోడలు" అనే భాగం నుండి 5 పద్యములు.
కూతురు కొడుకగునా యని
నీతులు జెప్పెదరెపుడు నిజమే యనుచున్
ఖాతరు జేయరు కొడుకులు
కూతురె నయమగును కొంత కొడుకులకన్నన్ ||
అత్తలు కొంచెము తగ్గిన
కొత్తగ ఇంటను అడుగిడు కోడలు కూడా
వత్తును పాదములయినన్
పెత్తనమును చేయుదెపుడు ప్రేమతో నుండున్ ||
కోడలు వచ్చిన అత్తయు
నీడవలెను వెంటనుండు నిమిషము విడకన్
కోడలు కూతురు కాదని
తేడానే జూపుచుండు తెలివిగా ఎపుడున్ ||
కూతురు సుఖపడవలెనని
వేతురు పథకములెన్నో వేగిరపడుచున్
ఖాతరు చేయరు కోడలి
నీతిని సంకించుచుండ్రు నేరము లేకన్ ||
No comments:
Post a Comment