31 వ పద్యము.
మంచిని కనుటకే కన్నులు
పొంచియు వినకు చెడు నీవు పొరపాటగురా
వంచించ జూడకెవరిని
మంచిని పెంపొందజేయు మనగలవవనిన్ ll
32 వ పద్యము.
ఆకలి యనుచును వచ్చిన
నీకడ లేకున్నగాని నీవెపుడయినన్
సాకెడి వారిని జూపిన
ఆకలి మాటే మరిచియు ఆనందపడున్ ll
33 వ పద్యము.
ధనమే అన్నిట ముఖ్యము
అనుటయె ఒప్పును వసుధను అది ఏమిటనన్
ధనమున్నవారు చెప్పిన
విననుందురు ఎవరయినను వినయము తోడన్ ll
34 వ పద్యము.
డబ్బుకు దాసులు కొందరు
అబ్బురపడనేల మీరు అనవసరముగా
నిబ్బరముగ యోచించిన
అబ్బదు ఆ గుణమెవ్వరికి అవనీతి యనిన్ ll
35 వ పద్యము.
మనిషికి కోర్కెలు సహజమె
వినసొంపుగ నుండినయని వినెదరు సుమ్మా
తను చేయనలవి కానిని
వినిపించిన నవ్వనుండు విపరీతముగా ll
36 వ పద్యము.
స్నేహితుని ఇంట పడతుల
మోహించక మెపుడు నీవు మోసంబగునే
ఐహిక వాంఛయు విడచిని
ఆహాయని నిన్నె బొగడు నందరు ఎపుడున్ ll
37 వ పద్యము.
నిన్నాదు కొన్నవారికి
నెన్నడు నన్యాయము మదినెంచకు సలుపన్
తిన్నింటికేను ద్రోహము
కన్నా యవనీతి లేదు గనవేలనురా ll
38 వ పద్యము.
సత్యము చేసెడి వారలు
ముత్యము వలె మెరయుచుండు ముదవలను గొలుపున్
నిత్యము సాధన చేసిన
ప్రత్యక్షముగా పుడమిని ఫలితము నొందున్ ll
39 వ పద్యము.
ధర్మము చేయుట మంచిది
నిర్మల మనమును విడువక నీవెపుడయినన్
కర్మ ఫలమని తలంచకు
ధర్మము నీకెపుడు రక్షధాత్రిన్ సుమ్మా ! ll
40 వ పద్యము.
ఒక్కరు సత్యము చెప్పిన
పక్కున నవ్వుచు అతనిని ప్రక్కకు తోయున్
టక్కరి మాటలు నుడివిన
ఎక్కువగును సత్కరించు ఎవరికి వారున్ ll
మంచిని కనుటకే కన్నులు
పొంచియు వినకు చెడు నీవు పొరపాటగురా
వంచించ జూడకెవరిని
మంచిని పెంపొందజేయు మనగలవవనిన్ ll
32 వ పద్యము.
ఆకలి యనుచును వచ్చిన
నీకడ లేకున్నగాని నీవెపుడయినన్
సాకెడి వారిని జూపిన
ఆకలి మాటే మరిచియు ఆనందపడున్ ll
33 వ పద్యము.
ధనమే అన్నిట ముఖ్యము
అనుటయె ఒప్పును వసుధను అది ఏమిటనన్
ధనమున్నవారు చెప్పిన
విననుందురు ఎవరయినను వినయము తోడన్ ll
34 వ పద్యము.
డబ్బుకు దాసులు కొందరు
అబ్బురపడనేల మీరు అనవసరముగా
నిబ్బరముగ యోచించిన
అబ్బదు ఆ గుణమెవ్వరికి అవనీతి యనిన్ ll
35 వ పద్యము.
మనిషికి కోర్కెలు సహజమె
వినసొంపుగ నుండినయని వినెదరు సుమ్మా
తను చేయనలవి కానిని
వినిపించిన నవ్వనుండు విపరీతముగా ll
36 వ పద్యము.
స్నేహితుని ఇంట పడతుల
మోహించక మెపుడు నీవు మోసంబగునే
ఐహిక వాంఛయు విడచిని
ఆహాయని నిన్నె బొగడు నందరు ఎపుడున్ ll
37 వ పద్యము.
నిన్నాదు కొన్నవారికి
నెన్నడు నన్యాయము మదినెంచకు సలుపన్
తిన్నింటికేను ద్రోహము
కన్నా యవనీతి లేదు గనవేలనురా ll
38 వ పద్యము.
సత్యము చేసెడి వారలు
ముత్యము వలె మెరయుచుండు ముదవలను గొలుపున్
నిత్యము సాధన చేసిన
ప్రత్యక్షముగా పుడమిని ఫలితము నొందున్ ll
39 వ పద్యము.
ధర్మము చేయుట మంచిది
నిర్మల మనమును విడువక నీవెపుడయినన్
కర్మ ఫలమని తలంచకు
ధర్మము నీకెపుడు రక్షధాత్రిన్ సుమ్మా ! ll
40 వ పద్యము.
ఒక్కరు సత్యము చెప్పిన
పక్కున నవ్వుచు అతనిని ప్రక్కకు తోయున్
టక్కరి మాటలు నుడివిన
ఎక్కువగును సత్కరించు ఎవరికి వారున్ ll
No comments:
Post a Comment