June 27, 2013

కర్మ రహస్యం

1. ప్రానమున్నంతవరకు పని చెయ్యండి. నేను మీకు అండగా ఉన్నాను. నేను పోయిన తరవాత కూడా నా అంతరాత్మ మీ వెంటే ఉండి పని చేస్తుంది. ఈ జీవితం వస్తుంది. పోతుంది. సంపద, కీర్తి, భోగాలు మూడునాళ్ళ ముచ్చటే. ఒక ప్రాపంచిక క్షుద్రకీటకంవలె చనిపోవటంకన్నా సత్యాన్ని బోధిస్తూ కార్యరంలో మరణించటం ఉత్తమం. ముందంజ వెయ్యండి.

2. మీలో ప్రతీ ఒక్కరూ, కార్య భారమంతా మీపైనే ఉందన్న భావంతో పని చెయ్యండి.

3. ఏ ఘనకార్యాన్నీ మోసంతో సాధించలేం. అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి.

4. జనసమూహం కాదు కావలసింది. పామరుల గుంపు ఒక శతాబ్దంలో చేసిన పనికంటే, నిష్కపటమైన హృదయపూర్వకంగా పనిచేసే కొద్దిమంది ఒక్క సంవత్సరంలోనే ఎక్కువగా సాధించగలరు.

5. నా ఆశ, విశ్వాసం మీ వంటివారి మీదనే ఉన్నాయి. యదార్థదృష్టితో నా మాటలను సరిగా అర్థం చేసుకొని, ఆ ప్రకారంగా మీరు కార్యోన్ముఖులవ్వండి. మీకు కావలసినంత సలహా ఇచ్చాను. కొంచమైన ఇప్పుడు ఆచరణలో పెట్టండి. నా మాటలు వినటం ఉపయొగకరమైనదని లోకానికి తెలియనీయండి.

6. ధైర్యంతో కర్తవ్యాన్ని నిర్వహించు. ఓర్పు స్థిరత్వాలతో పనిచేయి.....ఇదే ఏకైక మార్గము ఓర్మి, పవిత్రత, ధైర్యం, స్థిరత్వంతో పనిచేయాలని గుర్తుంచుకొని ముందుకు నడువు. పవిత్రంగా ఉండి నీ ఆదర్శాలకు కట్టుబడి ఉన్నంత కాలం నీకు అపజయం కలుగదు.

7. నీ ప్రతి పనిలోనూ ఆచరణాత్మకతను కనబరచు. ఆచరణ కొరవడిన అనేక సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా నాసనమైంది.





No comments:

Post a Comment