June 23, 2013

వీర్రాజు గారి పద్యములు 51 నుండి 60 వరకు

51 వ పద్యము.

చెట్టుకు కాయలు కాసిన 
కొట్టగ జూతురు తినుటకు కోరిక తోడన్ 
దిట్టముగ ధనంబుండిన 
ముట్టని వాడయిన నిన్ను ముట్టగనుండున్ ll 


 52 వ పద్యము.

నమ్మిన వారికి ఎపుడున్ 
కమ్మని మాటలు నుడుపుచు కపటము తోడన్ 
ఇమ్మహిలో దిరుగకెపుడు 
ముమ్మరముగ నీకె ముప్పు ముంచక వచ్చున్ ll 

53 వ పద్యము.

నీదియు కాదని తెలిసియు 
నాదని ఎగబడుట నీకు న్యాయంబగునా 
ఏదియు మిగలదు చివరకు 
నాదని వాపోయిన యెడ నవ్వులపాలే ll

54 వ పద్యము.

ఆలిని బిడ్డల చూడక 
పోలికలే మార్చుకొనగా మరియును సతమున్ 
మేలగునా అటు చేయగ 
కూలైన చేయు, సతి సుతుల కూరిమి విడకన్ ll  

 55 వ పద్యము.

మంచే యనిపించుకొనగ 
కొంచెము కష్టంబయినను కోరిక తీరున్ 
కించిత్తు తప్పు చేసిన 
కొంచెము యోచించరేల కోపము తోడన్ ll

 56 వ పద్యము.

కోతలు కోయుచునుందురు 
చేతలు చేయంగలేని చిన్న మనస్కుల్ 
గోతులు తీయగ వెరువరు 
ఘాతుకములు చేసి కూడా ఘనులుగ నుండున్ ll 

57 వ పద్యము.

కలిమిని జూచియు నీవున్ 
చెలిమిని జేయంగ బూని చేరకు మెపుడున్ 
కలిమేమి మిగిలిపోవదు 
కలకాలము చెలిమి యుండు కపటము వీడన్ ll 

58 వ పద్యము.

నిలువగ నీడయు లేకను 
కలతను జెందుచు నిరతము కాలము గడిపే 
దళితుల బాధలు గాంచియు 
కలతలు బాపెడు దొరలిల కానగరారే ll

59 వ పద్యము.

చూడుడు ఏ జాతియయినను 
వీడక తన తోటివాని వినయము జూపున్ 
చూడగ మానవ జాతే 
కీడును తలపెట్టనుండు భేదము తోడన్ ll

60 వ పద్యము.

కొబ్బరిలో నీరు వలెను 
యబ్బును సిరికూడ యటులె యగుపించకనే 
కొబ్బరి ఆరిన చందమె 
గబ్బున చనుచుండు సిరియు గనుడీ నిజమున్ ll 


No comments:

Post a Comment