శ్రీ గుల్లల వీర్రాజు గారి "సూక్తి సుమమాల" అనే నీతి పద్యములు నుండి
"చదువు" అనే భాగం నుండి 5 పద్యములు.
"చదువు" అనే భాగం నుండి 5 పద్యములు.
చదువుట వల్లను జ్ఞానము
పదిలముగా నబ్బ నీకు పదుగురి లోనన్
అధమునిగా నిన్నెవ్వరు
మది తలచగ నుండలేరు మరువకు మెపుడున్ ||
పదిలముగా నబ్బ నీకు పదుగురి లోనన్
అధమునిగా నిన్నెవ్వరు
మది తలచగ నుండలేరు మరువకు మెపుడున్ ||
2
చదువుట ముఖ్యము నీకిల
చదువే లేకున్న నీవు చవటవగుదుగా
చదువరి వయినను నిన్నే
పదుగురు కొనియాడనుంద్రు పలు విధములుగన్ ||
చదువరి వయినను నిన్నే
పదుగురు కొనియాడనుంద్రు పలు విధములుగన్ ||
పలు కష్టములకు నోర్చియు
వెలకట్టక చదువనేర్చ వేగిరపడుచున్
పిలచుచు నుండిరి యెందరొ
పలకా బలపము విడువక పరుగున రండో ||
వెలకట్టక చదువనేర్చ వేగిరపడుచున్
పిలచుచు నుండిరి యెందరొ
పలకా బలపము విడువక పరుగున రండో ||
వయసే మీరెను చదువగ
భయమగుచున్నది యనుచును పలుకగనేలా
నియమము లేదే చదువగ
రయమున చదువంగ వచ్చి రాణించవలెన్ ||
భయమగుచున్నది యనుచును పలుకగనేలా
నియమము లేదే చదువగ
రయమున చదువంగ వచ్చి రాణించవలెన్ ||
రక్కసి సదృశుల దునుమగ
అక్కర కొచ్చును చదివిన అనుమానంటే
తక్కువ చదివితి నేనని
పెక్కుగ దిగులొందబోకు పెక్కురిలోనన్ ||
అక్కర కొచ్చును చదివిన అనుమానంటే
తక్కువ చదివితి నేనని
పెక్కుగ దిగులొందబోకు పెక్కురిలోనన్ ||
No comments:
Post a Comment