September 8, 2013

గణేశ చరిత్ర విశేషాలు

వినాయకచవితి 

భాద్రపద శుద్ధచవితి నాడు, వినాయకచవితి జరుపుకుంటాము. అంటే వినాయకుని (జన్మదినం) పుట్టినరోజు. ఈ చవితికి మరో విశేషం కూడా ఉంది. ఈ చవితిరోజునే శివుడు.... గణేషుడిని, గణాధిపతిగా చేసాడు. అందుకే గణపతికి ప్రతీనెలా వచ్చే చవితి కూడా ప్రీతిపాత్రమైంది. 

చవితిచంద్రుడు అంటే దినదిన ప్రవర్ధమానమయ్యే చంద్రుడు. అలాగే ఆ రోజు వినాయకుడుని ఆరాధిస్తే మనము  రోజురోజుకీ అభివృద్ధి చెందుతాము. 

విఘ్నేశ్వరుడు విజ్ఞానానికి, వివేకానికీ ప్రతీక. ఏనుగు తలనుంచి ఎలుక వాహనం వరకు, అంగాంగము మనకు ఒక అమూల్యమైన పాఠమే.

గుమ్మిడికాయంత తల - పెద్దగా మనల్ని ఆలోచించమని చెబుతుంది. పెద్ద చెవులు - శ్రద్ధగా వినమని, చిన్నినోరు - వీలైనంత తక్కువగా మాట్లాడమని, చిన్ని కళ్ళు - సూటిగా లక్ష్యానికే గురిపెట్టమంటాయి. పెద్దకడుపు -- జీవితానుభవాల్ని తలపిస్తుంది. జీవితమంటే కష్టసుఖాలు, ఆనంద విషాదాలు, అన్నిటినీ జీర్ణించుకోవటమేనని, మనకి తెలియచేస్తున్నాడు లంబోదరుడు. ఆ తొండం ఎటైనా వెళుతుంది. ఎంతదూరమైనా చొచ్చుకొని వెడుతుంది. మనిషిలోని చంచల స్వభావమే -- చిట్టెలుక.  అహంకారాన్ని, అత్యాశల్ని  ఎప్పుడూ నెత్తికెక్కించుకోకూడదని, నిగ్రహశక్తితో వాటిని ఓడించాలి, మెడలు వంచి సవారీ చెయ్యాలి అని తెలియచేస్తుంది. ఇదే మనం గణేశుని నుంచి నేర్చుకోవలసింది.


గణపతిని తులసితో పూజించరాదు.  



గణేషునికి గరికపూజ అంటే ఎంతో ఇష్టం. అతనికి పూజ చేసేటప్పుడు 21 రకాల పత్రాలతో పూజచేయాలి. 
21 రకాల పిండివంటలతో నైవేద్యం చెయ్యాలి.

గణపతి పూజకు తులసిని వాడరాదు. పత్రిలో కలిపి వాడితే పర్వాలేదు, కానీ ప్రత్యేకించి తులసిదలములతో మాత్రం పూజించరాదు. ఈ విషయం బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. రాధా శాపంతో శంఖచూడుడు అనే రాక్షసుని తులసి వివాహమాడింది. ఈమె పతివ్రతగా ఉన్నన్నాళ్ళు ఆ రాక్షసునికి మరణం లేదు. ఆ కారణంతో ఒకరోజు విష్ణుమూర్తి శంఖచూడుని వేషంలో వచ్చి, తులసి పాతివ్రత్యానికి భంగం కలిగిస్తాడు. అప్పుడు శివుడు శంఖచూడుడుని సంహరిస్తాడు. ఈ సంఘటనతో తులసి ఆగ్రహించి, విష్ణుమూర్తిని శిలయైపొమ్మని శపిస్తుంది. అప్పుడు విష్ణువు ఆమె శరీరం గండకీ నదిగా మారిపొమ్మని, తాను ఆ నదిలో శాలగ్రామంగా ఉంటానని వరమిస్తాడు. ఆమె తలవెంట్రుకలు తులసిమొక్కలై పరమపవిత్రాలుగా ప్రసిద్ధిపొందుతాయని వరమిస్తాడు.

తులసి...ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ గంగాతీరంలో ఉన్న గణపతిని చూసి మోహిస్తుంది. అంతట గణపతి నిరాకరించటంతో తులసి అతనిని శపిస్తుంది. అకారణంగా నన్ను శపించావు కనుక, నీవు నాపూజకు పనికిరావు అని గణపతి ప్రతిశాపము ఇచ్చాడు. ఈ కారణంవల్ల గణపతి పూజకు తులసి పనికిరాదు.


మట్టి వినాయకుడినే మనం పూజించాలి. 


వినాయకుని పూజకు మనం కేవలం మట్టి విగ్రహాన్నే ఉపయోగించాలి. గంగలోని మట్టితీసి విగ్రహంచేసి, పూజించి,

మరల ఆ గంగలోనే నిమజ్జనం చెయ్యాలి. ఆ విధంగా సంవత్సరానికి ఒకసారి గంగాదేవిని గౌరవించుకుంటానని గణపతి దేవతలకు  తెలియచేసాడు. కనుక మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తేనే అందరికీ కార్యసిద్ధి కలుగుతుంది. 



మట్టివిగ్రహాన్ని పూజించండి....పర్యావరణాన్ని కాపాడండి......మీ ఆయువును పెంచుకోండి. 



6 comments:

  1. Great thing you made... to telugu pepople , you deserve it....

    ReplyDelete
  2. great job.......came to know little bit about the festival.

    ReplyDelete
  3. చక్కగా వివరించేరు....ధన్యవాదములు...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు అప్పారావు పెద్దనాన్నగారు ____//\\____

      Delete