కార్తీక మహాత్మ్యం -- ఎనిమిదవ రోజు కథ
నదీ
స్నానము,దీప
దానము,అన్న దానము,వస్త్ర
దానము చేస్తే పుణ్యాన్ని
సులభముగా పొందవచ్చు.
వేదోక్తంగా
యజ్ఞాలు చేసినా పాపాలు తొలగి
పుణ్యం లభిస్తుంది.
సాత్విక ధర్మం
మనం చేసిన పాపాలను పోగొట్టి
పవిత్రులని చేసి ఇహపర సుఖాలని
ఇస్తుంది.మనం
తెలిసో తెలియకో ఏ చిన్న ధర్మమయిన
పని చేసినా మంచి ఫలితాన్ని
ఇస్తుంది,పెద్ద
కట్టెల మోపు చిన్న పాటి అగ్నికణంతో కాలి బూడిద అయినట్టు, భగవంతుని
పేరుని తెలిసిగాని, తెలియకగాని
పలికితే వారు చేసిన అన్ని
పాపాలు పోయి మోక్షం పొందుతారు.
అజామీళుని
కథ
పూర్వం
కన్యాకుబ్జ అనే నగరంలో అన్ని
శాస్త్రాలు, వేదాలు చదివిన
సత్యవంతుడు అనే ఒక బ్రాహ్మణుడు
ఉండేవాడు. అతని
భార్య హేమవతి,
వారిద్దరూ
అన్యోన్య దంపతులు,
చాలాకాలము
తరవాత వారికీ ఒక కొడుకు పుట్టాడు.
అతనికి అజామీళుడు అనే పేరు
పెట్టారు. ఆ
బాలుడు చాలా గారాబంగా పెరగటంతో
చదువు చదవక, బ్రాహ్మణ
నియమాలు పాటించక చెడ్డవారి
సహవాసంతో చెడుతిరుగుళ్ళు
తిరుగుతూ, యవ్వనంలో
మద్యం సేవించి,
మాంసభక్షణ
చేస్తూ, యజ్ఞోపవీతాన్ని తెంచి
పారేసి, ఎరుకల
జాతి స్త్రీని వలచి ఆమెతోనే
జీవనం గడుపుతూ ఉండేవాడు.
ఇంటికి వచ్చి
తల్లిదండ్రులను పలకరించేవాడు
కాదు. పిల్లలని
గారాబము చేసిన సరే, అదుపులో
ఉంచుకోవాలి.... లేకుంటే
ఇటువంటి పరిస్థితులే ఎదుర్కోవలసి
వస్తుంది. అతని
అలవాట్లు వలన కులపెద్దలు
కులమునుండి వేలివేయటంతో అతని అరాచకాలకి అడ్డు లేకుండా పోయింది.
పక్షులను
జంతువులను వేటాడి కిరాతకునిగా
జీవితం గడుపుతుండేవాడు.
ఒకరోజు అజామీళుడు,
ఎరుకల స్త్రీ
.....ఇద్దరు
అడవిలో వేటకై తిరుగాడుచుండగా
వారికి ఒక చెట్టుపై తేనెపట్టు
కనిపించింది, తేనెని
తీయుటకు చెట్టుపైకి ఎక్కిన ఆ స్త్రీ కాలుజారి క్రిందపడి
మరణించింది.....ఆమె
చనిపోయినందుకు కొంతసేపు
ఏడ్చి, తరవాత
ఆమెను దహనం చేసి...అతని
కూతురు ఒక్కతే ఇంటి వద్ద
ఉన్నదని ఇంటికి వెళ్ళెను....కూతురు
యుక్తవయసుకు రాగానే కామాంధుడై కూతురిని కూడా చెరబట్టేను.....వారిరువురకు
ఇద్దరు పిల్లలు పుట్టి
మరణించారు.....మరల
ఆమె మరో బిడ్డకి జన్మనిచినప్పుడు
వారు ఆ బిడ్డకు నారాయణ అనే
పేరు పెట్టుకుని పిలుచుకునేవారు.
అలా కొంతకాలమునకు
అజామీళునికి నారాయణునిపై
మమకారము పెరిగి అస్తమాను
నారాయణుని పిలుస్తూ అనుకోకుండానే
భగవంతుని నామస్మరణ చేయుట
జరుగుతుండేది.
కొంతకాలమునకు
అజామీళునికి అవసాన దశ సమీపించి,
కొడుకుని
విదిచిపోవుచున్నాను అని
బాధకొద్ది "నారాయణ" "నారాయణ" అని పిలుస్తూ ప్రాణముని విడిచెను.
అతని ప్రాణాలను తీసుకుపోవుటకు వచ్చిన యమభటులు
నారాయణ శబ్దం వినినంతనే
వెనుకకు జంకిరి ....అంతట నారాయణుని దూతలు ప్రత్యక్షమై ఇతను హరి నామస్మరణ చేస్తూ ప్రాణాలు
విడిచాడు కనుక ఇతనిని మేము వైకుంఠమునకు తీసుకుపోతాము అనెను....ఇతను
చేసిన కిరాతక పనులకు ఇతనిని
నరకమునకు మేము తీసుకుపోతాము
అని అన్నారు యమభటులు.
అంతట విష్ణు దూతలు ఈ విధంగా సమాధానం చెప్పారు.
-:ఎనిమిదవరోజు
పారాయణము సమాప్తము:_
No comments:
Post a Comment