December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- రెండవ పాశురము

తిరుప్పావై పాశురాలు

 రెండవ పాశురము 

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు 
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్ 
పై యత్తు యిన్ర పరమనడిపాడి 
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి 
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్ 
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్ 
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి 
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్. !



భావం:--
కృష్ణుడు అవతరించిన కాలములో ఈలోకంలో పుట్టి, దుఃఖమయమగు ఈ ప్రపంచంలో కూడా ఆనందమునే అనుభవించుచున్న జనులారా ! మేము ఈవ్రతమునకు చేయు నియమములు వినుడు.పాలసంద్రంలో ధ్వనికాకుండా మెల్లగా నిద్రించిన ఆ పరమపురుషుని పాదపద్మములకు మంగళము పాడెదము. పాలను త్రాగము. కన్నులకు కాటుక ఉంచము. నేతిని భుజించము. సిగలో పూలను దాల్చము. అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము. చాడీలను చెప్పము. సన్యాసులకును, బ్రహ్మచారులకును సత్పాత్రదానము చేయుదుము. ఇంకను ఉజ్జీవించు మార్గములేవైన ఉన్న వాటిని తెలుసుకొని సంతోషంతో ఆచరించెదము. ఈ విధంగా ఈ ధనుర్మాస కాలమంతా కొనసాగించెదము. దీనినంతను విని, మీరు ఆనందింపగోరుచున్నాము.   

అవతారిక:--
ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తుంది. శ్రీకృష్ణునికి అంకితం కావటమే ముఖ్యమైన నియమం. భక్తి లేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం ... ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులూ - నియమాలు అంటూ ఏమీలేవు. కృష్ణుని యందు ప్రీతితో ఏది చేస్తే అవే అంటుంది గోదాదేవి.     


           

No comments:

Post a Comment