తిరుప్పావై పాశురాలు
మూడవ పాశురము
ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్. !
భావం:--
ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే ! దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన కృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది, ఆకాశమంత ఎత్తు ఎదిగి, మూడులోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్ని ఆచరిస్తే, దుర్భిక్షము అసలు కలుగనే కలుగదు. నెలకు మూడు వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలే ఆకాశమంత ఎత్తుకి ఎదిగి - ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరి ... భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదుక, గోవుల పొదుగులను తాకగానే -- కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైస్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తున్నది గోదాదేవి.
అవతారిక:--
ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీనినాచరించుట వలన -- వ్రతాన్ని ఆచరించిన వారికే కాక లోకమునకంతకును లాభము కల్గును. ఇది ఇహపరసాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మ కదా !శాస్త్రోక్తములగు నియమములను పాటించాలి. అలా పాటించనివారు ఇహపర లోకాలలో సుఖమునొందజాలరు అని కృష్ణపరమాత్మా తెలియచేస్తున్నారు.
No comments:
Post a Comment