December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైమూడవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైమూడవ పాశురము
మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గమ్ 
శీరియ శిఙ్గరివిత్తుత్తీ విళిత్తు 
వేరిమయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దుదరి 
మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టు 
పోదరుమాపోలే, నీ పూవైప్పూవణ్ణా ! ఉన్ 
కోయిల్ నిన్రిఙ్గనే ఫోన్దరుళి కోప్పుడైయ 
శీరియ శిఙ్గాపనత్తిరున్దు యామ్ వన్ద 
కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్ !



భావం:-
పర్వత గుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యముగల సింహము మేల్కొని, తీక్షణమగు చూపులని ఇటుఅటు చూచి, ఒకవిధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడునట్లు చేసి, అన్నివైపులకు దొర్లి, దులుపుకొని, వెనుకకు - ముందుకు శరీరమును చాపి, గర్జించి, గుహనుండి బయటకు వచ్చునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ ! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేసి రమణీయ సన్నివేశముగల లోకోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుంగ ప్రార్థించుచున్నాము. 

అవతారిక:-
అనన్యగతికలమై వచ్చి నిన్ను ఆశ్రయించినాము కటాక్షింపుము. అని గోపికలు ప్రార్థింపగా, శ్రీకృష్ణుని మనసులో చాలా బాధకలిగెను. నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్ను ఆశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్ళి సాయపడి రక్షింపవలసియుండగా, వేరొక గతిలేనివారము అని దైన్యముగా పలుకునట్లు ఉపేక్షించితినే ! ఎంత తప్పు చెసితిని అని కృష్ణుడు చాలా నొచ్చుకొనెను. స్త్రీలు ఇంట బాధపడుచుండగా ఊరకుండుట న్యాయముకాదు అని కృష్ణుడు బాధపడి, 'ఏమికావలెనో తెలపండి' అని గోపికలను అడిగెను.

గోపికలు తమ మనోరథము రహస్యముగా విన్నవించుటకు అంగీకరింపక సభామంటపమున విన్నవించవలెనని ఆస్థానమండపమునకు వేంచేసి తమ కోరికను పరిశీలింపవలెనని ఈ పాశురమున కోరుచున్నారు. 


          

No comments:

Post a Comment