December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- పదిహేడవ పాశురము

తిరుప్పావై పాశురాలు

పదిహేడవ పాశురము
అమ్బరమే , తణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుమ్ 
ఎమ్బెరుమాన్ ! నన్దగోపాలా! ఎళున్దిరాయ్, 
కొమ్బనార్కెల్లామ్ కొళున్దే ! కులవిళక్కే 
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అఱివురాయ్! 
అమ్బర మూడఱుతోజ్ఞ్గి యులగలన్ద 
ఉమ్బర్ కోమానే ! ఉఱజ్ఞ్గాదెళున్దిరాయ్ 
శెమ్ పొర్కళ లడిచ్చెల్వా ! బలదేవా ! 
ఉమ్బియుమ్ నీయు ముఱజ్ఞ్గేలో రెమ్బావాయ్. !



భావం:-
వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచినీరు కావలసినవారికి మంచినీరు, అన్నము కావలసినవారికి అన్నము, ప్రతిఫలాపేక్ష లేక ధర్మబుద్ధితో దానము చేయు నందగోపాలా, మాస్వామి మేలుకొనుము. సుకుమారము వంటి శరీరము గల స్త్రీలలో చిగురువంటి దానా మా వంశమునకు మంగళదీపము వంటిదానా, యశోదా మేలుకొనుము--- ఆకాశ మధ్యభాగమును చీల్చుకొని పెరిగి లోకములన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్య శూరులకు నాయకుడా ! నిద్రింపరాదు మేల్కొనుము. స్వచమైన బంగారముతో చేయబడిన కడియమును కాలిన దాల్చిన బలరామా ! నీవును - నీతమ్ముడును మేలుకొనవలెను. అని గోపికలు ఈ పాశురమున ప్రార్థించిరి. 

అవతారిక:-
గోపికలు ---- పదిమంది గోపికలను మేల్కొలిపి నందభవనమును చేరినారు. భవనపాలకుని ద్వారపాలకుని ప్రార్థించి వారి అనుమతిని పొందిరి. ద్వారపాలకుడు తలుపుతెరచి లోనికి వదలెను. గోపికలందరును నందగోపభవనమున ప్రవేశించిరి. నందగోపుడు, యశోద, శ్రీకృష్ణుడు, బలరాముడు వరుసగా మంచములపై శయనించిరి. 

ఆచార్య సమాశ్రయణముచే మంత్రమును, మంత్రార్థమగు సర్వేశ్వరుని తెలుసుకొనినను చాలదు. ఆ సర్వేశ్వరుని ప్రేమించిన భాగవతులను ఆశ్రయించి వారిని ఆశ్రయించుట చేతనే భగవానుడు తమను అనుగ్రహించునని తెలుసుకొనవలెను. ఈ విషయమును తెలియచేయుచు నందగోపుని, యశోదను, శ్రీకృష్ణుని, బలరాముని ఈ పాశురములో గోపికలు మేలుకొలుపుచున్నారు.               


              

2 comments: