December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- పదునాల్గవ పాశురము

తిరుప్పావై పాశురాలు
పదునాల్గవ పాశురము
ఉజ్ఞ్గల్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్ 
శెజ్ఞ్గళునీర్ వాయ్ నెగిలి న్దాంబల్ వాయ్ కూంబినకాణ్ 
శెజ్ఞ్గల్పొడిక్కూరై వెణ్ పల్ తవత్తవర్ 
తజ్ఞ్గల్ తిరుక్కోయిల్ శజ్ఞ్గిడువాన్ పోగిన్రార్ 
ఎజ్ఞ్గలై మున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్ 
నజ్ఞ్గా యెలున్దిరాయ్ నాణాదాయ్ నావుడై యాయ్ 
శజ్ఞ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్ 
పజ్ఞ్గయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్. !




భావం:-- 
స్నానము చేయుటకు గోపికల నందరును లేపుదునని చెప్పి నిద్రించుచున్న ఒక ఆమెను ఈ పాశురములో మేల్కొల్పుచున్నారు. ...... ఓ పరిపూర్ణురాలా ! నీ పెరటి తోటలో దిగుడుబావిలో ఎర్ర తామరలు వికసించినవి. నల్లకలువలు ముడుచుకొనిపోవుచున్నవి. లెమ్ము .... ఎఱ్ఱని కాషాయములను దాల్చి తెల్లని పలువరుస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమతమ ఆలయములలొ ఆరాధనము చేయుటకై పోవుచున్నారు లెమ్ము. ముందుగా  నీవు మేల్కొని వచ్చి, మమ్ములను లేపుదువు అని మాట ఇచ్చినావు కదా ? మరచితివా ? ఓ లజ్జా విహీనురాలా ! లెమ్ము , ఓ మాట నేర్పుగలదానా ! శంఖమును - చక్రమును ధరించిన వాడును, ఆజానుబాహువును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచిరమ్ము. 

అవతారిక:-
ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపెదనని చెప్పిన ఒకగోపిక మేల్కొల్పబడుచున్నది. ఈమె వీరి సంఘమునకు అంతకు నాయకురాలై నడిపింపగల శక్తి గలది, తన పూర్ణానుభవముచే ఒడలు మరచి తాను చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరించి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తను ఉండిపోయెను. ఈమె ఇంటిలో ఒకపెద్ద తోట కలదు. పెరటి వైపున ఉన్న ఆ తోటలో దిగుడుబావి కలదు. ఆ దిగుడుబావిలో తామరపూవులు, కలువపూవులు ఉన్నవి. ఆమె తన్మయతతో అనుభవించుచు ఇతరములను మరచి ఉండెను. అట్టి స్థితిలో ఉన్న గోపికను ఈరోజు మేలుకొలుపుచున్నారు.    

           

No comments:

Post a Comment