December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ఐదవ పాశురము

తిరుప్పావై పాశురాలు 

ఐదవ పాశురము 
మాయనై మన్ను, వడమదురై మైన్దనై 
త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై 
ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై 
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై 
తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు 
వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క 
పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్ 
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్ !



భావం:--
మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణాలు, చేష్టలు కలవాడు కృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించెను. భవత్సంభంధము ఎడతెగనట్టి మధురకు ప్రభువే. యమునానది తీరమందున్న గొల్లకులమున జన్మించి, ఆ గొల్లకులమును ప్రకాశింపచేసినవాడు. తల్లి యశోద గర్భమును కాంతివంతమొనర్చిన దామోదరుడు. గొల్లకుల మాణిక్యదీపము. వ్రతకారణముగా కృష్ణునిచేరి మనము ఇతరములైన కోరికలు ఏమీ కోరక, పవిత్రమైన మనస్సుతో స్వామికి పూలను అర్పించి, నమస్కరించి, నోరార అతని కళ్యాణగుణములను సంకీర్తన చేసి, ధ్యానించిన -- సంచిత పాపములను .. ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనము చేయుటవలన పాపములన్నీ అగ్నిలోపడిన దూదివలె భస్మమైపోవును. కావున స్వామి యొక్క తిరునామములను కీర్తించుకుందాము. 

అవతారిక:--
గోపికలందరూ ఆండాళ్ గోపిక పిలుపుననుసరించి ఒకచోట చేరిరి. వారిలో కొందరు వేదాంతము తెలిసినవారు. కొందరు ధర్మశాస్త్రమును తెలిసినవారు. వారిలో కొందరు ఈవిధంగా శంకించిరి. మనము కేవలము జ్ఞానము లేనివారముకదా ? తెలిసియు తెలియకయు ఎన్నో పాపములను చేసినవారముకదా, ఈ జన్మలోనేకాక అనాదికాలము నుండి ఆర్జించిన పాపములెన్నియో మనకున్నవికదా, మనకు కృష్ణభగవానుని సంశ్లేషము ఈ పాపములు తొలగినదే ఎట్లు లభించును?    


   

No comments:

Post a Comment