December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ఎనిమిదవ పాశురము

తిరుప్పావై పాశురాలు 

ఎనిమిదవ పాశురము
కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు 
మేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్ 
పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై 
కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ 
పావాయ్ ! ఎళున్దిరాయ్ పాడిప్పరైకొణ్డు 
మావాయ్ ! పిళన్దానై మల్లరై మాట్టియ 
దేవాదిదేవనై చ్చెన్రునామ్ శేవిత్తాల్ 
ఆవావెన్రా రాయ్ న్దరుళేలో రెమ్బావాయ్. !



భావం:-
తూర్పుదిక్కు తెల్లవారుతున్నది. చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి. మిగిలిన పిల్లలందరును కూడా వ్రతస్థలమునకు పోవుటకై బయలుదేరి, వెళ్ళుటవలన వారికి ప్రయోజనమని వెడుతున్నారు. అలా వెళుతున్నవారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు నీవాకిట వచ్చి నిలిచినాము. కుతూహలము కలదనా - ఓపడతీ ! లేచిరమ్ము ! కృష్ణ గుణములను కీర్తించి వ్రతమునకు ఉపక్రమించి వ్రతసాధనమగు పరను పొంది, కేశి అను రాక్షసుని చీల్చి చంపినవానిని, మల్లురను మట్టుపెట్టిన వానిని, దేవతలకు ఆదిదేవుడైన వానిని మనము వెళ్ళి సేవించినచో అయ్యో ! మీరే నావద్దకు వచ్చితిరే ! అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును.

అవతారిక:-
ఈనాటి గోపిక కృష్ణపరమాత్మకు కూడా కుతూహలము రేకెత్తించు విలాసవతి. పరిపూర్ణముగ స్త్రీత్వముగల ప్రౌఢ, కృష్ణుడే తనవద్దకు వచ్చునని ధైర్యముతో పడుకొన్నది. అట్టి ఆమె లేనిదే తాము కృష్ణుని వద్దకు వెళ్ళుట యోగ్యముకాదని భావించి, ఆమెను మేలుకొలుపుతున్నారు.                   


No comments:

Post a Comment