December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ఇరవై ఒకటవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవై ఒకటవ పాశురము
ఏట్రకలంగ ళెదిరిపొంగి మీదళిప్ప 
మాట్రాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కల్ 
ఆట్ర ప్పడైత్తాన్ మగనే ! యరివురాయ్ 
ఊట్రముడై యాయ్ ! పెరియాయ్ ! ఉలగినిల్ 
తోట్రమాయ్ నిన్ర శుడరే ! తుయిలెళాయ్ 
మాట్రారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్ 
ఆట్రాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే 
పోట్రియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్ !



భావం:-- 
పొదుగు క్రిందనుంచిన కడవలు చరచరనిండి, పొంగిపొరలునట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యాకములగు, ఉదారములగు బలసిన ఆవులుగల నందగోపుని కుమారుడా ! మేల్కొనుము. ప్రమాణదార్థ్యముగల మహామహిమ సంపన్నా ! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూపా ! నిద్రనుంచి లెమ్ము, శతృవులు నీ పరాక్రమమునకు లొంగి మేముకూడా నిన్ను వీడియుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి. 

అవతారిక:-
గోపికలు పురుషాకార భూతురాలగు నీలాదేవిని మేల్కొలిపిరి. ఆమె మేల్కొని 'నేను మీలో ఒకదానిని కదా ! నన్ను ఆశ్రయించిన మీకు ఎన్నడును లోపము ఉండదు. రండి. మనమందరము కలసి శ్రీకృష్ణుని మేల్కొలిపి అర్థింతుము.' అని తాను  శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి 'నీ గుణములకు ఓడి వచ్చినారము, అనుగ్రహింపుము'. అని ఈ పాశురమున నీలాదేవి  గోపికలతో కూడి శ్రీకృష్ణుని అర్థించుచున్నది.    


      

No comments:

Post a Comment