నిత్య ప్రార్థన శ్లోకాలు ... ... ... నిత్యసాధన స్తోత్రమాలిక
నిద్రలేవగానే స్తుతి
కరాగ్రే వసతే లక్ష్మీ: కర మధ్యే సరస్వతీ
కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం
నిద్రలేచి భూ ప్రార్ధన:
సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే
విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే
సూర్యోదయ శ్లోకం
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ |
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ ||
స్నాన శ్లోకం
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||
భోజనము చేసే ముందు పఠింపదగిన శ్లోకములు :
శ్లోకం: " త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే
గృహాణ సుముఖోభూత్వ ప్రసీద పరమేశ్వర"
బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మాగ్నౌబ్రహ్మణాహుతం I
బ్రహ్మైవతేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినా II
అహం వైశ్వనరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రితః I
ప్రాణాపాన సమాయుకః పచామ్యన్నం చతుర్విధం II
సంధ్యాదీప స్తుతి
దీపం జ్యోతి: పరం బ్రహ్మ దీప స్సర్వ తమోపహః I
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే II
సుఖ నిద్రకు మరియు దుస్స్వప్న నాశనానికి :
అగస్త్యో మాధవశ్చైవ ముచికుందో మహాబలః I
కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖ శాయనః II
రామస్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం I
శయనేయః పఠేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి II
గాయత్రి మంత్రం :
ఓం భూర్భువస్సువ: ! తథ్స’వితుర్వరే’ణ్యం !
భర్గో దేవస్య’ ధీమహి ! థియో యోన: ప్రచోదయా’’త్ !!
హనుమ స్తోత్రం :
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!
బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!
శ్రీరామ స్తోత్రం :
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
శ్రీకృష్ణ ద్వాదశ నామ స్తోత్రం
శ్రీకృష్ణ ఉవాచ
కిం తే నామ సహస్రేణ విజ్ఞాతేన తవార్జున
తాని నామాన్ని విజ్ఞాయ నరః పాపై: ప్రముచ్యతే
ప్రథమే తు హరిం విద్యాత్ - ద్వితీయం కేశవం తథా
తృతీయం పద్మనాభం చ - చతుర్థం వామనం స్మరేత్
పంచమం వేదగర్భం చ - షష్ఠం చ మధుసూదనం
సప్తమం వాసుదేవం చ - వరాహం చ అష్టమం తథా
నవమం పుండరీకాక్షం - దశమం హి జనార్దనం
కృష్ణమేకాదశం విద్యాత్ - ద్వాదశం శ్రీధరం తథా
ద్వాదశైతాని నామాని విష్ణుప్రోక్తాన్యనే కశః
సాయం ప్రాతః పఠేన్నిత్యం తస్య పుణ్యఫలం శృణు
చాంద్రాయణ సహస్రాణి - కన్యాదాన శాతానిచ
అశ్వమేధ సహస్రాణి - ఫలం ప్రాప్నోత్యసంశయః
అమాయాం పౌర్ణమాస్యాం చ ద్వాదశ్యాo తు విశేతః
ప్రాతః కాలే పఠేన్నిత్యం సర్వపాపై: ప్రముచ్యతే
గణేశ స్తోత్రం :
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!
అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ !
అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !!
శివ స్తోత్రం :
త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ !
ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !!
గురు శ్లోకం :
గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: !
గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !!
సరస్వతీ శ్లోకం :
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!
యు కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!
లక్ష్మీ శ్లోకం :
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!
వెంకటేశ్వర శ్లోకం :
శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!
దేవీ శ్లోకమ్ :
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే !
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!
దక్షిణామూర్తి శ్లోకం :
గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!
అపరాధ క్షమాపణ స్తోత్రం :
అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి !!
విశేష మంత్ర:
పంచాక్షరి - ఓం నమశ్శివాయ
అష్టాక్షరి - ఓం నమో నారాయణాయ
ద్వాదశాక్షరి - ఓం నమో భగవతే వాసుదేవాయ
మానస స్నానం:
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపివ|
యఃస్మరేత్ పుండరీకాక్షం సభాహ్యంతర శ్శుచిః||
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయతే నమః
మాతా పితృ వందనం:
శ్రీ మాతా పితరౌ నిత్యం జన్మనో మమ కారిణే|
ధర్మాది పురుషార్థేభ్యః ప్రథమం ప్రణమామ్యహం||
తండ్రికి నమస్కరించునపుడు:
యస్మాపార్థువ దేహాత్ పార్థువ భగవతాగురునా|
నింతు నమాంసి సహస్రం సహ్రస్ర మూర్తయే పిత్రే||
తల్లికి నమస్కరించునపుడు:
నగాయత్ర పరోమంత్ర నమాతు పరదేవతా|
నహరే రపరస్త్రాత ననృతత్ ఫరమం పథకం||
ఆత్మప్రదక్షిణ చేయునప్పుడు:
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః
ప్రాహిమం కృపయాదేవ శరణాగత వత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష
జనార్ధన రక్ష రక్ష పరమేశ్వర
దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తూ:
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పధ్బ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే ||
దేవుని దగ్గర గంట మ్రోగించునప్పుడు:
ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం |
తత్ర ఘంటా రవం కుర్యాత్ దేవతార్చన లాంచితం ||
గోమాత ప్రార్థన:
గావః పుణ్యః పవిత్రాశ్చ గోధానం పావనం తథా
గావో భవిష్యత భూతచగోవు సర్వం ప్రతిష్ఠితం
నమో బ్రహ్మణ్య దేవాయ | గోబ్రాహ్మణ హితాయచ|
జగద్ధితాయ కృష్ణాయ | గోవిందాయ నమో నమః||
అశ్వర్థ ప్రార్థన:(రావి చెట్టు)
మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతే విష్ణురూపిణే |
అగ్రతశ్శివరూపాయ వృక్షరాజాయతే నమో నమః ||
బిల్వ వృక్ష ప్రార్థన:(మారేడు చెట్టు)
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం |
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం ||
శమీ దర్శనం:
శమీ శమైతే పాపం శమీ శత్రు వినాశనం |
అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శిని ||
తులసి ప్రార్థన:
యన్మూలే సర్వతీర్థాని యన్మథే సర్వదేవతా |
యదగ్రేసర్వ వేదాశ్చ తులసీంత్వాం నమామ్యహం ||
తులసి కోసేటప్పుడు:
మాతస్తులసి గోవింద హృదయానందకారిణి
నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే
సూర్య ద్వాదశ నామాలు
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నంతు మహేశ్వరం
సాయంధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం
వినతా తనయో దేవః కర్మ సాక్షి సురేశ్వరః
సప్తాశ్వః సప్తరజ్ఞాశ్య అరణోమమ ప్రసీదతు
ఆదిత్యస్య నమస్కారం యేకుర్వంతి దినే దినే
జనాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే
గరుడ దర్శనము చేయునప్పుడు:
కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయచ
విష్ణువాహనమస్తుభ్యం పక్షి రాజాయతే నమః
కుంకుమ ధారణ మంత్రం:
కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం
ధారణేనాస్య శుభదం శాంతిరస్తు సదామమ
విభూతి ధారణ మంత్రం:
శ్రీకరంచ పవిత్రంచ శోకమోహ వినాశనం
లోకవస్యకరంచైవ భస్మం త్రైలోక్య పావనం
పిడుగు పడునప్పుడు:
అర్జునః ఫల్గుణః పార్ద కిరీటి శ్వేతవాహనః
బీభత్స ర్విజయః కృష్ణ స్సవ్యసాచీ ధనుంజయః
ఔషధం సేవించునప్పుడు:
ధన్వంతరిం గరుత్మంతం ఫణిరాజంచ కౌస్తుభం
అచ్యుతం చామృతం చంద్రం స్మరేదౌషదకర్మణి
కషాయము సేవించునప్పుడు:
శరీరే జర్ఘరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే
ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః
మేధాభివృద్ధికి దక్షిణామూర్తి స్తోత్రం:
గురవే సర్వలోకానాం భిషజేభవరోగినాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః
భయ నివారణకు:
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్య స్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే
దీపారధన స్తోత్రం:
జ్ఞానానందమయం దేవం | నిర్మల స్పటికాకృతిం |
ఆధారం సర్వవిద్యానాం | హయగ్రీవ ముపాస్మహే ||
ఉదయదీపం వెలిగించునప్పుడు:
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం |
దీపేన సాద్యతే సర్వం ఉదయ దీపం నమోస్తుతే ||
సంధ్యాదీపం వెలిగించునప్పుడు:
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం |
దీపేన సాద్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ||
తీర్థం సేవించునప్పుడు:
అకాల మృత్యుహరణం | సర్వవ్యాధి నివారణం |
సమస్త దురితోపశమనం | శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం||
భోజనం చేసేటప్పుడు దేవుడికి నైవేద్యం:
దివ్యాన్నం షడ్రసోపేతం నానాభక్ష్య సమన్వితం |
నైవేద్యం గృహ్యాతాం దేవ! భుక్తి ముక్తి ప్రదాయక ||
భోజన పూర్వ శ్లోకం:
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ||
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే |
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ||
భోజనం చేయునప్పుడు:
అన్నం బ్రహ్మ రసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వర |
ఇతే సంచింత్య భుంజానం దృష్తి దోషా నబాధతే ||
భోజనానంతర శ్లోకం:
అగస్త్యం వైనతేయంచ శమ్యంచ బడబాలనమ్ |
ఆహార పరిణామార్థం స్మరామిచ వృకోదరమ్ ||
ఇంటి నుండి బయటికి వెళ్ళునప్పుడు పఠించవలసిన స్తోత్రం:
ఆపదామ ప్రహర్తారం దాతారాం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
వజ్రం లాంటి శరీరం కోసం ఈ క్రింది శ్లోకం ప్రతీరోజు 28 సార్లు చదవాలి
ఓం నమో నారసింహాయ వజ్ర దంష్ట్రాయ వజ్రిణే
వజ్రదేహాయ వజ్రాయ నమో వజ్ర నఖాయచ
వివాహము కోసం, భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి ఐకమత్యానికి ఈ శ్లోకం చదవాలి
ప్రతీరోజు 28 సార్లు చదవాలి
కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే
నమః కామవిహారాయ కామరూప ధరాయచ
తప్పిపోయిన వ్యక్తులు, వస్తువులు తిరిగి పొందటానికి ఈ శ్లోకం చదవాలి
ప్రతీరోజు 28 సార్లు చదవాలి
కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే
దురలవాట్ల నుండి విముక్తి పొందటానికి ఈ శ్లోకం చదవాలి
ఓం హృషీకేశాయ నమః
వ్యాపారాభివృద్ధికి, ఇంటర్వ్యూలలో సఫలం కావటానికి
ఓం వషట్కారాయ నమః
శరీర సౌందర్యానికి, సంపదకి
ఓం శ్రీమతే నమః
విద్యాభివృద్ధికి, ఐశ్వర్యాభివృద్ధికి
ఓం అక్షరాయ నమః
క్రీడాకారులకి, స్వయం ఉపాధిలో ఉన్నవారికి ఉన్నత పదవులు ఆశించేవారికి
ఓం పరమాత్మనే నమః
మంచి ఆరోగ్యం కోసం
ఓం భూతభావనాయ నమః
మానసిక ఆరోగ్యానికి మానసిక ఒత్తిడి నుండి విముక్తికి
ఓం పూతాత్మనే నమః
ఉద్యోగంలో చేసే పనిలో అంకిత భావానికి తృప్తికి
ఓం శ్మరణే నమః
సంతానం కలగటానికి
ఓం ధాత్రే నమః
ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టటానికి
ఓం విధాత్రే నమః
మిత్రులతో స్నేహభావం పెంచుకోవటానికి అన్యోన్య దాంపత్యానికి
ఓం భూతదయే నమః
దుష్ట శక్తుల నుండి కాపాడుకోవటానికి 108సార్లు
ఓం స్థవిష్టాయ నమః
కష్టాల నుండి విముక్తి పొందటానికి 108సార్లు
ఓం పుష్కరాక్షాయ నమః
ఆపదలో ఉన్నప్పుడు స్మరించటానికి 108సార్లు
ఓం నారసింహ వపుషే నమః
సొంతంగా ప్లాట్లు, ఇళ్ళు కొనాలనేవారు చదవాల్సిన శ్లోకం 108సార్లు
ఓం క్షేత్రజ్ఞాయ నమః
స్పష్టమైన చూపు కోసం 108సార్లు
ఓం జ్యోతిషాంపతయే నమః
దుర్గా సప్తశ్లోకి
ఓం ఙ్ఞానికా మపి చేతాంసి దేవీ భగవతీ హి సా
బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి
ఓం దుర్గే స్మృతా హరసిభీతి మశేషజంతోః
స్వస్థైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి
దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ర్ధ చిత్తా
ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాద్కకే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే
ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే
ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్య స్త్రాహినోదేవి, దుర్గేదేవి నమోస్తుతే
ఓం రోగా నశేషా వపహంసి తుష్టా
రుష్టా తు కామాన్ సకలా నభీష్టాన్
త్వా మాశ్రితానాం న విపన్నరాణాం
త్రా మాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి
ఓం సర్వబాధా ప్రశమనం త్రయిలోక్య స్యాఖిలేశ్వరీ
ఏనమేవ త్వయాకార్య మస్మద్వైరి వినాశనం.
**********జయహో మాతా**********
ఏకశ్లోకి రామాయణం
అదౌ రామతపోవనాది గమనం హత్వామృగం కాంచనం
వైదేహి హరణం, జటాయు మరణం, సుగ్రీవసంభాషణం
వాలీ నిగ్రహణం, సముద్ర తరణం, లంకాపురీ దాహనం
పశ్చాద్రావణ కుంభకర్ణ హననం త్వేతద్ధి రామాయణం !!!
ఏకశ్లోకి భారతం
ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం లాక్షాగృహే దాహనం
ద్యూతే శ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనం
లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియా జృంభణం
భీష్మద్రోణ సుయోధనాది నిధనం హ్యేతన్మహాభారతం
ఏకశ్లోకి భాగవతం
ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహేవర్ధనం
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం
కంసచ్చేదన కౌరవాది హననం కుంతీ సుతాపాలనం
హ్యేతధ్బాగవతం పురాణ కధితం శ్రీకృష్ణలీలామృతం
సప్తశ్లోకి భగవద్గీత
ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ |
యఃప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్ ||
స్థానే హృషీకేశ! తవ ప్రకీర్త్యా, జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి, సర్వే సమస్యంతి చ సిద్ధసంఘాః ||
సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖమ్ |
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ||
కవిం పురాణమనుశాసితారమణోరణీయాంసమనుస్మరేద్యః |
సర్వస్య ధాతారమచింత్యరూపం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ||
ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||
సర్వస్య చాహం హృది సన్నివిష్టో, మత్తః స్మృతిర్జ్ఞానమపోహనంచ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ ||
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి యుక్వై మాత్మానం మత్పరాయణః ||
ఇతి శ్రీ మద్భగవద్గీతానూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం
యోగశస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే సప్తశ్లోకీ గీతా ||
సంకట నాశన గణేశ స్తోత్రం
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే ||
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ ||
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ ||
నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ ||
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ ||
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః ||
అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ||
శ్రీ గణేశ ద్వాదశ నామాలు
సముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటోవిఘ్న రాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజానన
వక్రతుండ శ్శూర్పకర్ణః హేరంబః స్కంద పూర్వజ
షోడశైతాని నామాని యః పఠేత్శృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేతథా
సంగ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే
అభీప్సితార్ధ సిధ్యర్ధం పూజితోయస్సురైరపి
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధిపతయే నమః
సూర్య ద్వాదశ నామాలు
1.ఓం మిత్రాయనమః
2.ఓం రవయేనమః
3.ఓం సూర్యాయనమః
4.ఓం భానువేనమః
5. ఓం ఖగాయనమః
6. ఓం పూష్ణేనమః
7. ఓం హిరణ్య గర్భాయనమః
8.ఓం మరీచయేనమః
9.ఓం ఆదిత్యా యనమః
10.ఓం సవిత్రేనమః
11. ఓం అర్కాయనమః
12. ఓం భాస్కరాయనమః
శ్రీ అష్టాదశ శక్తి పీఠ స్తోత్రము:
1. లంకాయం శంకరీ దేవీ, కామాక్షీ కాంచికాపురే |
ప్రద్యుమ్నే శృంగళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే |
2. అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమఋఅంబికా |
కొళాపురే మహాలక్ష్మీ, మహూర్యే ఏకవీరికా |
3. ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా |
ఓడ్యాయాం గిరిజాదేవీ, మాణిక్యాం దక్షవాటాకే |
4. హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేస్వరీ |
జ్వాలాయాం వైష్ణవీ దేవీ, గయా మాంగళ్యగౌరికా |
5. వారణసయాం విశాలాక్ష్మీ, కాశీరేషు సరస్వతీ |
అష్టాదస సుపీఠాని యోగినా మపిదుర్లభం |
6. సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశత్రు వినాశనం |
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభం ||
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |
భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ||
శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్ |
తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ ||
అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ ||
కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ||
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతమ్ |
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ||
యామ్యే సదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ||
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే ||
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే |
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ||
శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ||
యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ||
సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందమ్ |
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||
ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ |
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||
జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ||
శ్రీ శివపంచాక్షరీ స్తోత్రమ్:
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ|
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ|
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ|
తస్మై మకారాయ నమశ్శివాయ|
మందాకీని సలిల చందన చర్చితాయ|
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ|
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ|
తస్మై మకారాయ మకారాయ నమశ్శివాయ|
శివాయ గౌరీవదనారవిందాయ|
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ|
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ|
తస్మై శికారాయ నమశ్శివాయ|
వశిష్ఠ కుంభోద్బవ గౌతమార్య|
మునీంద్ర దేవార్చిత శేఖరాయ|
చంద్రార్క వైశ్వానరలోచనాయ|
తస్మై వకారాయ నమశ్శివాయ|
యక్ష స్వరూపాయ జటాధరాయ|
పినాక హస్తాయ సనాతనాయ|
సుదివ్య దేవాయ దిగంబరాయ|
తస్మై యకారాయ నమశ్శివాయ|
పంచాక్షర మిదం పుణ్యం - య:పఠే చ్ఛివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి - శివేన సహ మోదతే.
ఇతి శివ పంచాక్షరీ స్తోత్రమ్
శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం
నమస్తేஉస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోஉస్తు తే || 1 ||
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోஉస్తు తే || 2 ||
సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోஉస్తు తే || 3 ||
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోஉస్తు తే || 4 ||
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోஉస్తు తే || 5 ||
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోஉస్తు తే || 6 ||
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోஉస్తు తే || 7 ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోஉస్తు తే || 8 ||
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్]
కృష్ణాష్టకం
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ |
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ||
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ |
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ||
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ||
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ||
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ |
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ||
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ||
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ |
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ||
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||
శ్రీ సూర్యాష్టకం
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం
బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా
స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి
ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం
నవగ్రహ ధ్యానశ్లోకమ్
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోరియం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||
చంద్రః
దథిశఙ్ఞ తుషారాభం క్షీరార్ణవ సముద్భవమ్ |
నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్ ||
కుజః
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ |
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ||
బుధః
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||
గురుః
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్ |
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||
శుక్రః
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||
శనిః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ||
రాహుః
అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||
కేతుః
ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||
ఫలశ్రుతిః
ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘ్న శాంతిర్భవిష్యతి ||
నర నారీ నృపాణాం చ భవే ద్దుస్వప్ననాశనమ్ |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ||
గ్రహ నక్షత్రజాః పీడా స్తస్కరాగ్ని సముద్భవాః |
తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే నసంశయః ||
రామాయణ జయమంత్రం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
హనుమాన్ చాలీసా
దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ ||
ధ్యానమ్
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||
చౌపాఈ
జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||
రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవనసుత నామా || 2 ||
మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||3 ||
కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || 4 ||
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై |
కాంథే మూంజ జనేవూ సాజై || 5||
శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||
విద్యావాన గుణీ అతి చాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || 7 ||
ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామలఖన సీతా మన బసియా || 8||
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా |
వికట రూపధరి లంక జరావా || 9 ||
భీమ రూపధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే || 10 ||
లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉరలాయే || 11 ||
రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ || 12 ||
సహస వదన తుమ్హరో యశగావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 ||
సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || 14 ||
యమ కుబేర దిగపాల జహాఁ తే |
కవి కోవిద కహి సకే కహాఁ తే || 15 ||
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా || 16 ||
తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా || 17 ||
యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||
దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 ||
రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆఙ్ఞా బిను పైసారే || 21 ||
సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డర నా || 22 ||
ఆపన తేజ తుమ్హారో ఆపై |
తీనోఁ లోక హాంక తే కాంపై || 23 ||
భూత పిశాచ నికట నహి ఆవై |
మహవీర జబ నామ సునావై || 24 ||
నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || 25 ||
సంకట సేఁ హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||
సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా || 27 ||
ఔర మనోరధ జో కోయి లావై |
తాసు అమిత జీవన ఫల పావై || 28 ||
చారో యుగ పరితాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా || 29 ||
సాధు సంత కే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || 30 ||
అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా |
అస వర దీన్హ జానకీ మాతా || 31 ||
రామ రసాయన తుమ్హారే పాసా |
సాద రహో రఘుపతి కే దాసా || 32 ||
తుమ్హరే భజన రామకో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై || 33 ||
అంత కాల రఘువర పురజాయీ |
జహాఁ జన్మ హరిభక్త కహాయీ || 34 ||
ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ || 35 ||
సంకట కటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బల వీరా || 36 ||
జై జై జై హనుమాన గోసాయీ |
కృపా కరో గురుదేవ కీ నాయీ || 37 ||
జో శత వార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహా సుఖ హోయీ || 38 ||
జో యహ పడై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీశా || 39 ||
తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా || 40 ||
దోహా
పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ |
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ||
సియావర రామచంద్రకీ జయ | పవనసుత హనుమానకీ జయ |
బోలో భాయీ సబ సంతనకీ జయ |
శ్రీరామపంచరత్నం
కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ
కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ || 1 ||
విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ
వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 2 ||
సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయ
సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 3 ||
పీతాంబరాలంకృత మధ్యకాయ పితామహేంద్రామర వందితాయ
పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 4 ||
నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ
నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ || 5 ||
ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వపాప వినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్ ||
ఇతి శ్రీశంకరాచార్య విరచిత శ్రీరామపంచరత్నం సంపూర్ణం
విష్ణు షట్పది
అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః || 1 ||
దివ్యధునీమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే |
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే || 2 ||
సత్యపి భేదాపగమే నాథ తవాஉహం న మామకీనస్త్వమ్ |
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః || 3 ||
ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే |
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః || 4 ||
మత్స్యాదిభిరవతారైరవతారవతాஉవతా సదా వసుధామ్ |
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోஉహమ్ || 5 ||
దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద |
భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే || 6 ||
నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ |
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు ||
గుర్వష్టకం
శరీరం సురూపం తథా వా కలత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ |
మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 1 ||
కలత్రం ధనం పుత్ర పౌత్రాదిసర్వం, గృహో బాంధవాః సర్వమేతద్ధి జాతమ్ |
మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 2 ||
షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా, కవిత్వాది గద్యం సుపద్యం కరోతి |
మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 3 ||
విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః, సదాచారవృత్తేషు మత్తో న చాన్యః |
మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 4 ||
క్షమామండలే భూపభూపలబృబ్దైః, సదా సేవితం యస్య పాదారవిందమ్ |
మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 5 ||
యశో మే గతం దిక్షు దానప్రతాపాత్, జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్ |
మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 6 ||
న భోగే న యోగే న వా వాజిరాజౌ, న కంతాముఖే నైవ విత్తేషు చిత్తమ్ |
మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 7 ||
అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే, న దేహే మనో వర్తతే మే త్వనర్ధ్యే |
మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 8 ||
గురోరష్టకం యః పఠేత్పురాయదేహీ, యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ |
లమేద్వాచ్ఛితాథం పదం బ్రహ్మసంఙ్ఞం, గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ || 9 ||
గురుపాదుకా స్తోత్రం
అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ |
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 1 ||
కవిత్వవారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్ |
దూరికృతానమ్ర విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 2 ||
నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః |
మూకాశ్ర్చ వాచస్పతితాం హి తాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 3 ||
నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యామ్ |
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 4 ||
నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్ |
నృపత్వదాభ్యాం నతలోకపంకతే: నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 5 ||
పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్ర్వరాభ్యామ్ |
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 6 ||
శమాదిషట్క ప్రదవైభవాభ్యాం సమాధిదాన వ్రతదీక్షితాభ్యామ్ |
రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 7 ||
స్వార్చాపరాణామ్ అఖిలేష్టదాభ్యాం స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ్ |
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 8 ||
కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యామ్ |
బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 9 ||
కనకధారా స్తోత్రం
వందే వందారు మందారమిందిరానంద కందలం
అమందానంద సందోహ బంధురం సింధురాననమ్
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః || 1 ||
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవా యాః || 2 ||
ఆమీలితాక్షమధిగ్యమ ముదా ముకుందమ్
ఆనందకందమనిమేషమనంగ తంత్రమ్ |
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవన్మమ భుజంగ శయాంగనా యాః || 3 ||
బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతోஉపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయా యాః || 4 ||
కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనా యాః || 5 ||
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకా యాః || 6 ||
విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్షమ్
ఆనందహేతురధికం మురవిద్విషోஉపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదర సహోదరమిందిరా యాః || 7 ||
ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరా యాః || 8 ||
దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధారాం
అస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః || 9 ||
గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంబరీతి శశిశేఖర వల్లభేతి |
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై || 10 ||
శ్రుత్యై నమోஉస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యై నమోஉస్తు రమణీయ గుణార్ణవాయై |
శక్త్యై నమోஉస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమోஉస్తు పురుషోత్తమ వల్లభాయై || 11 ||
నమోஉస్తు నాళీక నిభాననాయై
నమోஉస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై |
నమోஉస్తు సోమామృత సోదరాయై
నమోஉస్తు నారాయణ వల్లభాయై || 12 ||
నమోஉస్తు హేమాంబుజ పీఠికాయై
నమోஉస్తు భూమండల నాయికాయై |
నమోஉస్తు దేవాది దయాపరాయై
నమోஉస్తు శార్ంగాయుధ వల్లభాయై || 13 ||
నమోஉస్తు దేవ్యై భృగునందనాయై
నమోஉస్తు విష్ణోరురసి స్థితాయై |
నమోஉస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోஉస్తు దామోదర వల్లభాయై || 14 ||
నమోஉస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోஉస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమోஉస్తు దేవాదిభిరర్చితాయై
నమోஉస్తు నందాత్మజ వల్లభాయై || 15 ||
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || 16 ||
యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః |
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే || 17 ||
సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుక గంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే
త్రిభువనభూతికరీ ప్రసీదమహ్యమ్ || 18 ||
దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారుజలాప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకధినాథ గృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ || 19 ||
కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణాపూర తరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృతిమం దయాయాః || 20 ||
దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః
కళ్యాణగాత్రి కమలేక్షణ జీవనాథే |
దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మాం
ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః || 21 ||
స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ |
గుణాధికా గురుతుర భాగ్య భాగినః
భవంతి తే భువి బుధ భావితాశయాః || 22 ||
సువర్ణధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ||
గోవింద నామావళి
శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా
నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా
వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా
గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా
మత్స్య కూర్మ గోవిందా మధు సూధనా హరి గోవిందా
వరాహ న్రుసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా
సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా
కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా
పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా
పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవిందా
అభయ హస్త గోవిందా అక్షయ వరదా గోవిందా
శంఖ చక్రధర గోవిందా సారంగ గదాధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
విరాజ తీర్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా
సాలగ్రామ హర గోవిందా సహస్ర నామ గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా
ఏడు కొండల వాడా గోవిందా ఏకత్వ రూపా గోవిందా
రామ క్రిష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా
వజ్ర మకుటదర గోవిందా వైజయంతి మాల గోవిందా
వడ్డీ కాసుల వాడా గోవిందా వాసుదేవ తనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మానంద రూపా గోవిందా భక్త తారకా గోవిందా
నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా
హతి రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా జగత్ సాక్షి రూపా గోవిందా
అభిషేక ప్రియ గోవిందా అభన్నిరాసాద గోవిందా
నిత్య శుభాత గోవిందా నిఖిల లోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇపరాజ రక్షక గోవిందా
పద్మ దలక్ష గోవిందా పద్మనాభా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
తిరుమల నివాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
శేష సాయి గోవిందా శేషాద్రి నిలయ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పంచాయుధ స్తోత్రం
స్ఫురత్సహస్రారాశిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటి తుల్యం
సురద్విషాం ప్రాణవినాశి విష్టో: చక్రం సదాహం శరణం ప్రపద్యే
విష్టోర్ముఖోత్దానిల పూరితస్య, యస్య ధ్వనిర్ధానవదర్పహంతా
తం పాంచజన్యం శశికోటి శుభ్రం, శంఖం సదాహం శరణం ప్రపద్యే
హిరణ్యయూం మేరుసమానసారాం, కౌమోదకీం దైత్యకులైకహంత్రీమ్
వైకుంఠవామాగ్రకరాగ్రమృష్టాం, గదాం శరణం ప్రపద్యే
యజ్జ్యానినాదశ్రవణాత్ సురాణాం, చేతాంసి, నిర్ముక్తభయాని సద్యః
భవంతి దైత్యాశని బాణవర్షై, శారుంగం సదాహం శరణం ప్రపద్యే
రక్షో సురాణాం కఠినోగ్రకంఠ చ్ఛేదక్షరత్ ర్క్షోణితదిగ్ధసారమ్
తం నందకం నామ హరే: ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపత్తే
ఇమం హరే: పంచమహాయుధానాం, స్తవం పఠేద్యోనుదినం ప్రభాతే
సమస్త దుఃఖాని భయాని సద్య: పాపాని నశ్యంతి సుఖాని సంతి
వనే రణే శత్రుజలాగ్ని మధ్యే యదృచ్చయాపాత్సు మహాభయేషు
పఠేద్వ్తిదమ స్తోత్రమనాకులాత్మాసుఖీ భవత్ తత్క్ర్రత సర్వరక్షః
********************************************
ఈశ్లోకం రోజుకు 28సార్లు, 40 రోజులుచదవాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, దేవుని పూజ చేసుకుంటూ చదవాలి. ఈవిధంగా చేస్తే 40 రోజులు పూర్తి అయ్యేసరికి
పెళ్ళి కుదురుతుంది. మనస్పర్థలు ఉన్న ఆలూమగల మధ్య సఖ్యత కుదురుతుంది.
కామేశ్వరాయ కామాయ - కామపాలాయ కామినే
నమః కామ విహారాయ - కామరూప ధరాయచ
పుష్కరాలు ఎప్పుడెప్పుడు వస్తాయి – వాటి వివరములు
ఇట్టి గురుడు మేషాది రాసులయందు ప్రవేశించినప్పుడు ఆయా నియమిత నదీ తీర్థముల యందు పుష్కరతీర్థములు అగును. ఆ సమయమున త్రింశత్రికోటి దేవతలునూ, సమస్త నదీనదములునూ, ఆయా తీర్థములయందు(నదుల యందు) పితృదేవతలతో సహా ప్రవేశింతురు. ఆయా నదీతీర్థముల యందు పుష్కరకాలమున పితృదేవతలకు తర్పణములు, దానములు జరిపించిన సహస్ర ఫలితము కలుగును. పితృదేవతలు తరింతురు. సహజముగా గురుడు అతి చారగతిలో రాశియందు ప్రవేశించి, తిరిగి వక్రగతితో వెనుక రాశికి వక్రించి, తిరిగి ఋజమార్గమున రాశియందు ప్రవేశించినప్పుడు అనగా ఈ రెండవసారి ప్రవేశించినప్పుడు మాత్రమే పుష్కరకాలము అంటారు.
ఈ గురుడు ఏరాశియందు ప్రవేశించినను 1 సంవత్సర కాలము ఉండి, తిరిగి ముందు రాశికి ప్రవిశించును. ప్రవేశించిన 12 రోజులవరకు పుష్కరకాలం అంటారు.
గోదావరీనదికి మాత్రముగురుడు సింహరాశిలో ప్రవేశించిన తరవాత 12 రోజులు పుష్కరకాలమును, అంత్యమున అనగా కన్యారాశిలో ప్రవేశించుటకు ముందు 12 రోజులు అంత్యపుష్కరకాలము జరుపుతారు.
1) గురుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగానదికి పుష్కరాలు వస్తాయి.
2) గురుడు వృషభరాశిలో ప్రవేశించినప్పుడు నర్మదానదికి పుష్కరాలు వస్తాయి.
3) గురుడు మిథునరాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతినదికి పుష్కరాలు వస్తాయి.
4) గురుడు కర్కాటకరాశిలో ప్రవేశించినప్పుడు యమునానదికి పుష్కరాలు వస్తాయి.
5) గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరినదికి పుష్కరాలు వస్తాయి.
6) గురుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి.
7) గురుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు కావేరీనదికి పుష్కరాలు వస్తాయి.
8) గురుడు వృశ్చికరాశిలో ప్రవేశించినప్పుడు తామ్రపర్ణి(భీమరధీ)నదికి పుష్కరాలు వస్తాయి.
9) గురుడు ధనుస్సురాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరిణీనదికి పుష్కరాలు వస్తాయి.
10) గురుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్రానదికి పుష్కరాలు వస్తాయి.
11) గురుడు కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధునదికి పుష్కరాలు వస్తాయి.
12) గురుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు ప్రణితానదికి పుష్కరాలు వస్తాయి .
శాంతి మార్గము
(అశాంతితో అలమటించే మనస్సుకు ప్రశాంతత చేకూర్చే శాంతి వచనములు. ఇవి శ్రీకృష్ణ భగవానుని నోటిద్వారా వచ్చిన అమృత గుళికలు)
అయినదేదో మంచికే అయినది
అవుతున్నదేదో అదీ మంచికే అవుతున్నది
అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది
నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకున్నావు
నీవేమి సృస్టించావని నీకు నష్టం వాటిల్లింది?
నీవు ఏదైతే పొందావో అవి ఇక్కడ నుంచే పొందావు
ఏదైతే ఇచ్చావో అదీ ఇక్కడే ఇచ్చావు
ఈనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా .....
నిన్న ఇంకొకరిసొంతం-- రేపు మరొకరి సొంతం కాగలదు.
పరివర్తన చెందడం అనేది లోకం యొక్క పోకడ.
ఫలితం ఏదైనా దైవప్రసాదంగా స్వీకరించు
కాలం విలువైనది, మంచి పనులు వాయిదా వేయకు
అహింసను విడనాడకు-- హింసను పాటించకు
కోపాన్ని దరిచేర్చకు ఆవేశంతో ఆలోచించకు
ఉపకారం చేయలేకపోయినా -- అపకారం తలపెట్టకు
దేవుడిని పూజిస్తూ...... ప్రాణికోటికి సహకరించు
శాంతిమార్గమును అనుసరిస్తూ భగవదాసీర్వాదాన్ని పొందు
ఓం శాంతి: శాంతి: శాంతి:...........
రథసప్తమి రోజున స్నానం చేస్తూ చదివే శ్లోకం
యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు
తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమీ
రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకు, రేగిపండు తలపైన ఉంచుకొని ఈ శ్లోకాన్ని చదువుకుంటే ఏడు జన్మలనుండి మనల్ని వెన్నంటి ఉన్న సమస్త పాపాలు నశిస్తాయి.
మాఘమాసో మహాన్ మానః నీరంనారాయణాత్మకం
ప్రాతఃస్నానంచపూజాచ భుక్తి ముక్తి ప్రదేశుభే
తస్మాన్ముముక్షవోజీవా యతధ్వంముక్తి వృత్తయే
భజధ్వం కేశవందేవం శివంవానిటలేక్షణమ్ ll
భావం
మాఘమాసము మహత్తరమైన - సర్వోత్తమమైన మాసము. జలము నారాయణాత్మకము. ఈ మాసమున ప్రాతఃకాలంలో స్నానము చేసి ఇష్ట దైవమును పూజించితే భుక్తిని - ఇహలోక సుఖానుభవమును మోక్షమును ఇచ్చును. కనుక భయంకరము, బాధాకరము అయిన సంసారబంధము నుండి మోక్షమును కోరేవారు ..... భుక్తిని - విముక్తిని ప్రసాదించు మాఘమాస ప్రవృత్తికై ప్రయత్నించండి. సర్వదేవతాస్వరూపుడైన శ్రీమన్నారాయణుని కానీ, నుదుటన కన్నుగల శివుడుని కానీ పూజించి, మాఘమాస వ్రతము ఆచరించి, సేవించి, తరించండి.
కోటి పుణ్యములను ప్రసాదించు గోమాత పూజ
పుట్టినబిడ్డకు తల్లిపాలకు సమానంగా ఆవుపాలను ఇస్తారు. అందువల్ల భూలోక ప్రజలకు అమృతతుల్యమైన పాలనిచ్చే ఆవు ..... తల్లితో సమానంగా వ్యవహరిస్తారు. తల్లి స్థానంలో వుండే ఆవు ప్రజలకు ప్రత్యక్షదైవము అంటే అతిశయోక్తి కాదు.
అంతేకాక సకల దేవతలు ఈ పవిత్రమైన గోమాత శరీరంలో కొలువై వుండటంవల్ల గోమాతను దర్శించినా, స్పర్శించినా పుణ్యం లభిస్తుంది.
(1) బ్రహ్మ, నారాయణుడు కొలువైన ఆవుకొమ్ములను పూజిస్తే జ్ఞానము, ముక్తి లభిస్తాయి.
(2) ఆవు నొసట .... ఈశ్వరుడు కొలువై ఉండుటవల్ల, నొసలు పూజిస్తే విశ్వేశ్వరుడిని దర్శించిన భాగ్యం లభిస్తుంది.
(3) ముక్కు వద్ద సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉండుటవల్ల నాసిక భాగాన్ని పూజించినవారికి సంతానభాగ్యం లభిస్తుంది.
(4) దూడను ప్రసవించిన ఆవును పూజిస్తే జాతకదోషాలు తొలగిపోయి, వివాహం జరుగుతుంది. ఆవు యోనిని పూజిస్తే జన్మకాల, దుష్ట నక్షత్రముల దోషము పరిహారమవుతుంది. ఎన్నో కష్టాలను కలిగించే ఋణబాధలు తీరిపోతాయి.
(5) అక్షయపాత్ర వంటి ఆవు పొదుగుని పూజిస్తే నాలుగు సముద్రాలను పూజించిన పుణ్యఫలం దక్కుతుంది.
(6) గోవుపాలు, గోమూత్రము, నెయ్యి మొదలైన ఔషధగుణాలు ఉన్నట్లు విజ్ఞానపూర్వకంగా నిరూపించబడింది.
(7) ఆవు పేడను బూడిదలా చేసి, నొసట రాసుకుంటే దుష్టశక్తుల నుండి రక్షించబడతాము.
గోమాతను పూజించండి...... కోటిపుణ్యాలను పొందండి.
మంగళము :
ఓం సర్వేత్ర సుఖినస్సంతు
సర్వేసంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్దు:ఖ మాప్నుయాత్ II
(అంతా సుఖంగా ఉండాలి. ఏ రోగం లేకుండా క్షేమంగా ఉండాలి. ఏ ఒక్కరును దుఃఖంతో ఉండకూడదు. ఇది వేద ప్రార్థన. ఇది హిందూమత ఆదర్శం)
సర్వేజనాస్సుఖినోభవంతు.
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు
ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:
తెలుసుకోదగిన విషయాలు
1) నమస్కారము అనగా అహంకారాహిత్యము, మః = నాకు నేను ఉపయుక్తుడను, న = కాను అనగా నన్ను నేను ఉద్ధరించుకొనలేను, నీవే నన్ను ఉద్ధరించుము అని చెప్పుకొనుట.
2) 1) స్త్రీ పై గల ప్రేమ మోహము 2) ధనముపై గల ప్రేమ లోభము 3) దీనులపై గల ప్రేమ దయ 4) పిల్లలపై గల ప్రేమ వాత్సల్యము 5) దేహముపై గల ప్రేమ అభిమానము 6) వస్తువులపై గల ప్రేమ మమకారము 7) సమానులపై గల ప్రేమ మైత్రి 8) సజ్జనులపై గల ప్రేమ స్నేహము (సత్సంగము) 9) పెద్దలపై గల ప్రేమ గౌరవము 10) దేవునిపై గల ప్రేమ భక్తి అనబడును. భక్తి కంటే గొప్పది ప్రేమ, ప్రేమ కంటే ధర్మ జ్ఞాన వైరాగ్యాది విషయములు వినుట గొప్పది. వినుట కంటే సజ్జనులతో స్నేహము చేయుట గొప్పది. సత్సంగము కంటే గురువు గొప్పవారు.
నవ విధ భక్తులు
1) తామస అధమ భక్తి = ఇతరులు చెడిపోవలెనని పూజలు చేయుట
2) తామస మధ్యమ భక్తి = కపటముతో అన్నవస్త్రాదుల గురించి భజించుట
3) తామస ఉత్తమ భక్తి = ఇతరులు చేయుచున్న పూజలు చూసి మాత్సర్యముతో తాను కూడా చేయుచుండుట
4) రాజస అధమ భక్తి = ధనము భూమి ఆరోగ్యము సంతానము మొదలగు కోరికలు సిద్ధింపవలెనని పూజించుట
5) రాజస మధ్యమ భక్తి = కీర్తి ప్రతిష్టల కొరకు పూజించుట
6) రాజస ఉత్తమ భక్తి = స్వర్గాది లోకముల సుఖప్రాప్తికి కొరకు పూజించుట
7) సాత్విక అధమ భక్తి = పాపములు నశింపవలెనన్న కోరికతో భజించుట
8) సాత్విక మధ్యమ భక్తి = భగవంతుడు (గురువు ) మెచ్చుకొనవలెనని సేవించుట.
9) సాత్విక ఉత్తమ భక్తి = నా జీవిత విధి నేడు కర్తవ్యతా బుద్ధితో పూజించుట
సూచన: మోక్షాపేక్ష గలవారు రాజస తామస భక్తి లక్షణములు వాడాలి సాత్విక భక్తినే అభివృద్ధి చేసుకొనవలెను.
నిజపుష్పనాలు
12) అహింసా ప్రథమం పుష్ప పుష్పం మింద్రియ నిగ్రహం సర్వభూత దయాపుష్పం క్షమాపుష్పం విశేతః శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తథై వచ సత్యమష్ట మిదం పుష్పం దేవ ప్రీతికరం భవేత్
13) నిశ్చలమైన భక్తి విశ్వాసములు కలిగి శరీరముతో పూజ వాక్కుతో సంకీర్తన మనస్సుతో స్మరణ చేయుట అనునది ఈశ్వర పూజ అనబడును
14) భగవన్నామ స్మరణచే సమస్త రోగములు నశించును. కామము క్రోధము భయము నశించును. అఖండమైన శాశ్వతమైన అనంతమైన నిర్వికల్పమైన నిర్వికారమైన పరబ్రహ్మానందామృతము ఎల్లప్పుడూ అనుభవంలో ఉండును. ఇది సత్యం, నామస్మరణా విడువకు
15) ఎన్ని పూజలు వ్రతములు చేయువారైననూ దానబుద్ధి లేనిచో జీవితము ధన్యము కాదు
16) భూత దయతో స్వార్థబుద్ధిని వదలి సమత్వ భావనతో వర్తింపుము
17) భక్తులతో కలసి తిరుగుతూ భగవంతుని సదా భజించు జీవితము ధన్యత నొందును
18) పూజ భజన యజ్ఞము మొదలగు సత్కర్మలు చేయుచుండువారు క్రోధము తెచ్చుకొనినచో పుణ్యకర్మలు ఫలము నశించును
19) మనము భగవంతునిపై పూర్తిగా ఆధారపడి ఉన్నప్పుడు మనలను భగవంతుడే కాపాడుచుండును. మన జీవిత రక్షణ మనమే చేసుకుంటున్నంత వరకూ దేవుని సహాయము దొరకదు.
20) మారేడు దళమునకు మధ్య ఆకు శివుడు అని, కుడివైపు దళం విష్ణువు అని, ఎడమవైపు దళం బ్రహ్మ అని అంటారు
21) బిల్వదళము కాశీ క్షేత్రంతో సమానము. మారేడు చెట్టు ఉన్నచోట శివుడు లింగరూపమున నివశించును. మారేడు వృక్షము తమ ఇంటి ఈశాన్యమున ఐశ్వర్యము, తూర్పున సుఖము, పడమర పుత్రసంతానము, దక్షిణ దిక్కున ఉన్నచో యమా బాధలు ఉండవు.
22) తులసి గౌరి అంశము. మాలతి లక్ష్మీ అంశము, ఉసిరి సరస్వతీ అంశము (స్వధా) మారేడు తులసి ఉసిరి ఉన్న స్థలమును మహాపుణ్యస్థలంగా గ్రహించవలెను.
23) మారేడు - వెలగ - తులసి - వావిలి ఉత్తరేణి వీటిని పంచబిల్వములు అంటారు. ఈ పంచ బిల్వములతో శివుని పూజింపవచ్చును. తులసితోనూ ఉసిరి పండ్లతోనూ విష్ణువును పూజించిన మంచిది. గణపతిని తులసి ప్రతితో పూజింపరాదు. - జపాన్ దేశములో నేటికీ ప్రతి ఇంట తులసి చెట్టు ఉండును.
24) తులసి కార్తీక పౌర్ణమి రోజున అవతరించుటచే ఆ రోజున విశేషంగా తులసి పూజ చేసిన శుభములు చేకూరును
25) శ్రీo హ్రీo క్లీo ఐo బృందావనీ స్వాహా అను మంత్రముతో తులసిని పూజించిన సర్వ సిద్ధులు పడయగలరు.
26) ఏ ఇంటిలో తులసి, గోవు, భాగవతము లేక భగవద్గీత ఉండునో ఆ ఇంటిలో కలిమాయ ప్రవేశించదు.
27) సువాసన లేని పుష్పములతో దేవుని పూజింపరాదు
28) తెల్లని పుష్పములతో పూజించిన ఎడల కోరికలు సిద్ధించును. పసుపు పచ్చని పువ్వుల వలన ఐశ్వర్యము కలుగును. బంగారు వన్నె గల పూవులతో పూజించిన రాజసూయ యాగ ఫలము లభించును.
భూమాత భరించలేనని చెప్పిన వస్తువులు:
1) ముత్యములు 2) పూజాద్రవ్యములు 3) శివలింగములు 4) సాలగ్రామము 5) పూలు 6) దీపము 7) రత్నములు 8) యజ్నోపవీతము 9) శంఖము 10) పుస్తకములు 11) జపమాల 12) పూలదండ 13) తులసి 14) కర్పూరము 15) బంగారము 16) గోరోచనము 17) చందనము 18) సాలగ్రామ తీర్థం 19) తమలపాకులు 20 గీత - భాగవత గ్రంథములు 21) నైవేద్యం 22) గంట
పై వాటిని నేలమీద పెట్టకుండా గౌరవంగా చూసుకోవాలి.
29) పసుపు కలిపిన బియ్యంతో పూజ చేయరాదు. తప్పనిసరి పరిస్థితి ఐనప్పుడు కొంచెముగా కుంకుమ కలిపి చేయవలెను.
30) దేవుని దీపమునకు నువ్వులనూనెనే వాడవలెను. - తూర్పు దిశగా దీపశిఖ ఉండవలెను. నేతి దీపము కుడిప్రక్క - నూనె దీపము ఎడమప్రక్క పెట్టవలెను.
31) రెండు వత్తులు ఒకటిగా చేసి ఆత్మ + పరమాత్మ అనే భావనతో దీపం వెలిగించవలెను
32) పూవు వత్తిని ఈశ్వర లింగాకారముగా తలచి - ఒక వత్తే కుందె మధ్యన వెలిగించవచ్చును
33) పూజామందిరంలో గణపతి ప్రతిమలు ఒకటి తప్ప మరొకటి ఉండరాదు
34) దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయవచ్చును - కానీ దేవుని ఎదుట గిరగిరా తిరగరాదు
35) పూజ చేసేటప్పుడు కానీ - తీర్థము పుచ్చుకునేటప్పుడు కానీ చిటికిన వేలు చూపుడు వేలు తగలకుండా ఉంచుకొనవలెను.